Rain Alert in AP :ప్రతి సంవత్సరం అక్టోబరులో ఏపీకి తుపానుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో ఈ నెలలో వచ్చిన తుపానులు ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా మిగిల్చాయి. అందుకే అక్టోబర్ ఈ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా వారిలో ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతారు. పైలిన్, హుద్ హుద్, అంపన్ ఇలా పేరేదైనా, ఎక్కడ తీరం దాటినా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో విపత్తులు పొంచి ఉంటాయి. గతంలో ఈ నెలలో వచ్చిన తుపానులు ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా మిగిల్చాయి.
Cyclone Warning to AP :ఏపీకి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ నమూనాలు (మోడల్స్) అంచనా వేస్తున్నాయి.
ఏపీకి 3 తుఫాన్ల హెచ్చరిక! - పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల 17 నాటికి రాష్ట్రంలోని తీరం దాట వచ్చని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) భావిస్తోంది. ఇది తుపానుగా బలపడి రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు రాష్ట్రం మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు అంటున్నారు.