Railways To Set UP Rail Coach Factory In Kazipet :తెలంగాణకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన హామీలలో మరో హామీని కేంద్రం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్‌గ్రేడ్ చేయాలని 2023 జులై 5న ద. మ రైల్వే జీఎంకి రైల్వే బోర్డు లెటర్ రాసింది.
రాష్ట్రానికి అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - RAIL COACH FACTORY IN KAZIPET
రాష్ట్ర విభజన హామీలలో మరో హామీని నెరవేర్చేదిశగా కేంద్రం అడుగులు - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్న రైల్వేశాఖ

Published : Nov 28, 2024, 8:59 PM IST
అప్‌గ్రేడ్ చేసినటువంటి యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు వీలుగా యూనిట్‌ని అభివృద్ధి చేయాలని ఈ ఏడాది(2024) సెప్టెంబరు 9న రైల్వే బోర్డు ఆదేశాలు జారీచేసింది. కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్లాన్‌ను రూపొందించాలని ఈ మేరకు రైల్వే బోర్డు సూచించింది. విభజన హామీల అమలుపై తెలంగాణ రాష్ట్ర అధికారులు, కేంద్ర అధికారులతో హోం శాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయం వెల్లడైంది.