Radisson Hotel Drugs Case Updates :హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ చిన్న వయసులోనే విలాసాలకు అలవాటు పడ్డాడు. జల్సాల కోసం తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా 2021లో మాదకద్రవ్యాల దందాలోకి అడుగుపెట్టాడు. డ్రగ్స్ నెట్‌వర్క్‌లో పట్టు పెంచుకున్న నిందితుడు హైదరాబాద్‌కు చెందిన ప్రస్తుతం గోవాలో ఉండే ఉస్మాన్ అలియాస్ ఫైజల్‌తో పరిచయం ఏర్పడింది. గోవాలోని కొల్వాలే జైలులో ఉండే ఫైజల్ దేశవ్యాప్తంగా అన్ని నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసే నెట్‌వర్క్‌కు కింగ్‌పిన్‌లా వ్యవహరిస్తున్నాడు.
అబ్దుల్ రెహ్మాన్ తనకు డ్రగ్స్ (Drugs smuggling in Telangana)అవసరమున్న ప్రతిసారీ ఫైజల్‌ను సంప్రదించేవాడు. ఫైజల్ తన నెట్‌వర్క్ ద్వారా మత్తుమందును దిల్లీలో డెలివరీ చేయిస్తాడు. రెహ్మాన్ అనుచరుడు, దిల్లీకి చెందిన నరేంద్ర శివనాథ్ అక్కడ అందుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లో విక్రయిస్తారు. ఇందుకోసం ఈ మూడు నగరాల్లో 15 మంది చొప్పున అనుచరుల్ని నియమించుకుని రెండు చేతులా సంపాదిస్తున్నారు. కేవలం పబ్బుల దగ్గర యువతకు మాత్రమే అమ్మకం సాగిస్తారు. రెహ్మాన్ డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చే డబ్బుతో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
'రాడిసన్ డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు' - హైకోర్టులో దర్శకుడు క్రిష్ పిటిషన్
Radisson Drugs Party Case Updates : ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లో నెట్‌వర్క్ నడిపిస్తున్న అబ్దుల్ రెహ్మాన్‌పై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఆరు కేసులున్నాయి. ఫిబ్రవరి తొలివారంలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రగ్స్ బానిసైన యువతిని వేధిస్తూ ఆమెతో మత్తు పదార్థాలు విక్రయించిన కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. రెహ్మాన్ పోలీసులకు చిక్కకుండా వేర్వేరు నగరాల్లో సంచరిస్తూ నెట్‌వర్క్ నడిపిస్తున్నట్లు తేలింది.
కూపీలాగితే బయటపడిన వ్యవహారం : ఈ కేసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అబ్దుల్ రెహ్మాన్, శివనాథ్ చిక్కారు. కాగా రాడిసన్ హోటల్లో (Radisson Drugs Case Updates) డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వ్యవహారంలో ఫిబ్రవరి 25న మంజీరా గ్రూపు డైరెక్టర్ వివేకానంద్ అతని స్నేహితులు నిర్భయ్, రఘు చరణ్, కేదార్, సందీప్, నీల్, సినీ దర్శకుడు క్రిష్, శ్వేత, లిషిపై కేసు నమోదైంది. అసలు వీరికి డ్రగ్స్ ఎలా చేరుతున్నాయని పోలీసులు కూపీలాగగా మంజీరా గ్రూపు సంస్థల మాజీ ఉద్యోగి సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ వివేకానంద్‌కు అందిస్తున్నట్లు తేలింది.