Quiz on Ramayana Kavyam in Uganda : భారతదేశానికి దూరంగా ఉన్న హిందూ పిల్లలు సంస్కృతి, వారసత్వము, పురాణాలు, ఇతిహాసాలు మరచిపోకుండా ఉగాండా రాజధాని కంపాలాలో కిటెన్టే ప్రాంతంలో రామాయణ కావ్యంపై క్విజ్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 54 టీమ్‌లు పాల్గొనగా సుమారు 216 పిల్లలు ఉన్నారు. రామాయణ కావ్యంపై క్వాలిఫైయింగ్ రౌండులో పోటీ పడి 22 టీమ్‌లు ద్వితీయ రౌండ్‌కు చేరుకున్నాయి.
సంస్కృతి, పురాణాలు, ఇతిహాసాలు మరచిపోకుండా 'ఉగాండా'లో రామాయణ కావ్యంపై క్విజ్ పోటీలు - Quiz on Ramayana in Uganda - QUIZ ON RAMAYANA IN UGANDA
Quiz on Ramayana Kavyam : ఉగాండా రాజధాని కంపాలా నగరంలో ఉన్న హిందూ పిల్లలు సంస్కృతి, వారసత్వం, పురాణాలు, ఇతిహాసాలు మరచిపోకుండా రామాయణ కావ్యంపై క్విజ్ ప్రోగ్రాం ప్రారంభించారు. సుమారు 216 మంది పిల్లలు 54 టీమ్‌లుగా పాల్గొన్నారు. క్వాలిఫైయింగ్ రౌండులో పోటీ పడి ద్వితీయ రౌండ్‌కు 22 టీమ్‌లు చేరుకున్నాయి.
Published : Sep 6, 2024, 10:24 PM IST
2011 మేలో కంపాలా నగరము కిటెన్టే ప్రాంతంలో సప్తగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులకు కొంగు బంగారమై కొలువుతీరింది. 13 సంవత్సరాలుగా భక్తులందరి కోరికలు తీరుస్తూ ఎన్నో వైభవోపేతమైన కార్యక్రమాలతో భక్తుల మదిలో చిరస్థాయిగా కొలువుదీరి ఉన్నాడు ఆ శ్రీనివాసుడు. ఆలయ ధర్మకర్తలు, పూజారులు, భక్తుల మొక్కులతో యథావిధిగా స్వామివారిని కలియుగ ప్రత్యక్ష దైవంలా భాసిల్లుచున్నారు. ఈ నేపథ్యంలో అద్వైత గీత మండలి స్వామివారి కీర్తనలు, పాటలు, భగవద్గీత శ్లోకాలు నేర్పే మహిళా సమూహం ఏర్పడింది.
ఇతిహాసాలు, కథలు తెలియజేయాలని : తరువాతి తరాలకు హిందూ ఇతిహాసాలు, కథలు తెలియజేయాలన్న ఆలోచనలతో సఫలీకృతం అవ్వడమే కాకుండా ఎంతో మందిలో ఆధ్యాత్మికత మేల్కొన్నదని అక్కడున్న హిందూ భక్తులు చెబుతున్నారు. ఈ జ్యోతి ఇలానే వెలుగుతూ భారతీయులు ఎక్కడ ఉన్నా ఒక్కటే అన్నట్టు వంటి భావన ప్రతి మదిలోను వెల్లివిరియాలని ఆక్షాంక్షిస్తున్నారు.