తెలంగాణ

telangana

ETV Bharat / state

'న్యూ ఇయర్'​ వేళ - బిర్యానీ కోసం అర కిలోమీటరు 'క్యూ లైన్' - QUEUE LINE FOR BIRYANI IN HYDERABAD

బిర్యానీ కోసం తప్పని తిప్పలు - సుచిత్ర చౌరస్తాలోని మై ఫ్రెండ్స్ సర్కిల్ రెస్టారెంట్ వద్ద బిర్యానీ ప్రియుల భారీ క్యూలైన్

Queue Line For Biryani In Hyderabad
Queue Line For Biryani In Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 9:18 AM IST

Queue Line For Biryani: హైదరాబాద్​ బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారో చెప్పండీ. ఏదైనా స్పెషల్​ డే ఉందంటే చాలు మామ.. చికెన్​ బిర్యానీ చేసేద్దామా. అమ్మ దమ్​ బిర్యానీ చేయొచ్చు కదా. లేకపోతే రెస్టారెంట్​కి వెళ్లి హైదరాబాద్​ దమ్​ బిర్యానీ తిందామా అంటూ మాటలు వినిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు చికెన్​ బిర్యానీ లేనిదే ముద్ద దిగదు. ఇదే తంతు ఆదివారం వస్తే కూడా ఉంటుందండోయ్. అలాంటి బిర్యానీ కోసం సాధారణ హాలిడేస్​లోనే జనాలు రెస్టారెంట్లు, హోటళ్లు ముందు పడిగాపులు కాస్తున్నారు. అలాంటిది నూతన సంవత్సర వేడుకలు అంటే అమ్మో! మరి ఇక ఆగుతారా చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా ముక్క ఉండాల్సిందే.. హైదరాబాద్​ బిర్యానీ తినాల్సిందే.

రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను వైభవంగా అందరూ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో బిర్యానీ పార్శిళ్ల కోసం జనం క్యూ కట్టారు. అదేంటి న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ మానేసి బిర్యానీ కోసం జనాలు వరుస కట్టారా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఆ క్యూ లైన్​ సుమారు కిలోమీటర్ల దూరం ఉందంటే నమ్మగలరా? వారిలో సొంతంగా బిర్యానీ కోసం వచ్చినవారు కొందరైతే.. చాలా మంది ఆన్​లైన్​లో ఆర్డర్లు కోసం వేచి ఉన్న ఫుడ్​ డెలివరీ బాయ్స్. దీంతో హైదరాబాద్​లోని పలు బిర్యానీ సెంటర్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. దీంతో బిర్యానీ ప్రియులకు తిప్పలు తప్పడం లేదు.

కానీ నగరంలోని సుచిత్ర చౌరస్తాలోని ఓ రెస్టారెంట్​ వద్ద బిర్యానీ ప్రియులు, ఫుడ్​ డెలివరీ బాయ్స్​ అర కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఇది చూసిన బయట జనాలు "ఏంటీ బిర్యానీ కోసం ఇంత పెద్ద క్యూలైనా" అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. న్యూ ఇయర్​ అప్పుడు సెలబ్రేషన్స్​ మానేసి ఇదేంటీ బిర్యానీ షాపుల ముందు క్యూలైన్స్​ అని కొందరు విసురుకుంటున్నారు. ఏదేమైనా హైదరాబాద్​ వాసులు మాత్రం మరోసారి బిర్యానీ ప్రియులని మాత్రం నిరూపించుకున్నారు. ఈ మధ్యనే ఓ ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్​లో నిమిషానికి 34 బిర్యానీ పార్శిళ్లు షేల్​ అవుతున్నాయని తెలిపారు. ఇప్పుడు దానిని ఈ న్యూ ఇయర్​ వేడుకల్లో బిర్యానీ ఆర్డర్లు క్రాస్​ చేస్తాయోమో చూడాలి.

హోటల్​ బంపర్ ఆఫర్ - కేవలం రూ.4కే చికెన్‌ బిర్యానీ

ఉదయం దోశ, రాత్రి బిర్యానీ - ఏడాదిలో కేవలం ఆ ఐటమ్​కే 1.57 కోట్ల ఆర్డర్లు

ABOUT THE AUTHOR

...view details