ALLU ARJUN AT PUSHPA 2 SUCCESS MEET: హైదరాబాద్‌లో 'పుష్ప 2' సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రేక్షకులు లేకుండానే సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కేవలం కొద్దిమంది ముఖ్యమైన వారు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చి, ఇన్ని రికార్డులు సాధించడానికి కారణమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తమ సినిమాను ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు.
పుష్ప2 విజయమంతా దర్శకుడు సుకుమార్‌దే అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. తనను ఎత్తుకొన్ని ఎక్కడో పెట్టాడని సుకుమార్‌ని కొనియాడారు. తొలిరోజు వచ్చిన 'పుష్ప 2' కలెక్షన్లే తన సినిమా ఎంత మంది చూశారనడానికి నిదర్శనం అని అన్నారు. ప్రాంతీయ సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి దేశంలో ఉన్నతస్థాయిలో ఉందని వెల్లడించారు.
సంధ్య థియేటర్ ఘటనపై మరోసారి:అదే విధంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనపై మరోసారి అల్లు అర్జున్ స్పందించారు. తాను మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వెళ్లానన్నారు. అయితే థియేటర్ బయట అభిమానుల ఒత్తిడి ఉండటం వల్ల తాను పూర్తి సినిమా చూడకుండానే వెళ్లిపోయానని వెల్లడించారు. రేవతి చనిపోయారని తెలిశాక స్పందించడానికి సమయం పట్టిందని, అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.