Purandeswari Birthday Celebrations in East Godavari :నరేంద్ర మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కళ్యాణ్ శక్తి కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌సభ కూటమి అభ్యర్థి పురందేశ్వరి అన్నారు. పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపల్లిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పురందేశ్వరి కూటమి శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు. పురందేశ్వరి పుట్టినరోజు కానుకగా 50వేల మెజారిటీ ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను నిడదవోలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ కోరారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇతర నాయకుల సమక్షంలో పురందేశ్వరి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పార్టీ నాయకులు కార్యకర్తలు పురందేశ్వరికి శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ చేయించారు.
'ఇంత మంది ఆత్మబంధువుల మధ్య నా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. అయోధ్య రాముని ఆశీస్సులతో, నా తండ్రి నందమూరి తారక రామారావు ఆశీస్సులతో మీ ముందుకు వచ్చానని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. నరేంద్ర మోదీ స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు యుక్తి, పవన్ కళ్యాణ్ శక్తి కలిసి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడతాయి. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో మన చూపుడు వేలుపై వేసే నల్లటి ఇంకు చుక్క మన భవిష్యత్తును మార్చుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. సమర్థవంతుడ్ని నాయకుడిగా ఎన్నుకోవాలి.' -దగ్గుబాటి పురందేశ్వరి, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి
పింఛన్ పంపిణీ అంశాన్ని వైసీపీ రాజకీయం చేస్తుంది: పురందేశ్వరి - PURANDESWARI ON PENSIONS