తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 9:21 PM IST

ETV Bharat / state

పడకేసిన ప్రత్యేక పాలన- సమస్యల వలయంలో తెలంగాణ పల్లెలు - special officer rule in villages

Problems in Special Officer Rule : పాలకవర్గాల గడువు ముగియడంతో, పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన పడకేసింది. ఓవైపు గ్రామాల్లో ఎక్కడికక్కడే సమస్యలతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే, ప్రత్యేక అధికారులు మాత్రం పల్లెలకు చుట్టుపు చూపుగానే వస్తున్నారు. పారిశుధ్ధ్యంపై పర్యవేక్షణ కొరవడటం వంటి సమస్యలతో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి.

Special Officer Rule in Villages
Problems in Special Officer Rule

పడకేసిన ప్రత్యేక పాలన- సమస్యల వలయంలో తెలంగాణ పల్లెలు

Problems in Special Officer Rule : పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన పడకేసింది. పాలకవర్గాల గడువు ముగియడంతో, ప్రత్యేక అధికారుల పాలనలో నెట్టుకొస్తున్న పంచాయతీల్లో, ప్రత్యేక అధికారుల పాలనతో కొత్త చిక్కులు తప్పడం లేదు. అసలే ఉన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామాల్లో, ఒక్కో అధికారికి మూడు నాలుగు పంచాయతీల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, వారు చుట్టపు చూపుగానే పల్లెల్లో పర్యటనలు చేస్తుండటంతో, సమస్యల చిట్టా అంతకంకతూ పేరుకుపోతోంది.

ప్రధానంగా తాగునీటి సమస్యలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.మిషన్ భగీరథ(Mission Bhagiratha) పైపులైన్ల లీకేజీలు వారాల తరబడి పరిష్కారం లేకపోవడం, పాడైన చేతిపంపులు నెలల తరబడి మరమ్మతులు చేయకపోవడం, పారిశుధ్ధ్యంపై పర్యవేక్షణ కొరవడటం వంటి సమస్యలతో పంచాయతీలు విలవిల్లాడుతున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు, విధుల భారంతో వారానికోసారి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో, చాలావరకు పంచాయతీల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు

Special Officer Rule in Villages :ఖమ్మం జిల్లాలో 589, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నెలాఖరుకు గ్రామాల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో, ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం చుట్టింది. పెద్ద పంచాయతీలకు మండల అధికారులు, చిన్న పంచాయతీలకు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని ప్రత్యేక అధికారులుగా నియమించి పాలన సాగిస్తున్నారు.

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోతున్నాయి. ఎక్కువ గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్లు చాలాచోట్ల లీకై నీటి సరఫరా జరగడం లేదు. గ్రామాల్లో బోర్లు పాడైపోయాయి. వాటిని బాగు చేయించే నాథుడే లేకుండా పోయారు. భూగర్భ జలాలు అడుగంటి చేతి పంపులు వట్టిపోతున్నాయి. పారిశుధ్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మురుగు కాల్వల శుభ్రత వారానికోసారి కూడా సాధ్యం కాకపోవడం వల్ల, పారిశుధ్ధ్యం పడకేసింది.

గ్రామాల్లో చెత్త సేకరణకు గతంలో ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. నెలవారీ ఈఎంఐలు భారంగా మారాయి. ట్రాక్టర్లు మరమ్మతులు వస్తే, చేయించేందుకు వారాల తరబడి సమయం పడుతోంది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీళ్లు పెట్టకపోవడంతో ఎండిపోతున్నాయి.హరిత హారంలో భాగంగా మొక్కలు నాటేందుకు గానూ నర్సరీలు పెంచుతున్నారు. ఈ నర్సరీల సంరక్షణ సక్రమంగా సాగడం లేదు.

కేంద్ర ప్రభుత్వ నిధులు రెండు నెలలకోసారి మంజూరవుతున్నా సరిపోక పంచాయతీలకు ఇక్కట్లు తప్పడం లేదు. పాలకవర్గం ఉన్న సమయంలో అప్పో సప్పో తెచ్చి గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పూనుకునే వారు. బిల్లులు మంజూరైనప్పుడు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు పంచాయతీల్లో నిధుల లేమితో అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రత్యేక అధికారుల పాలనలో రాజకీయ జోక్యం మితిమీరింది. గ్రామాలకు మంజూరైన పనుల్లో రాజకీయ పార్టీల నాయకుల జోక్యం పెరిగింది. ఆయా పనులకు సంబంధించి ఒత్తిళ్లు తప్పకపోవడం వల్ల అధికారులపై మిన్నకుండిపోతున్నారు.

బోర్డులకే పరిమితమైనన రాష్ట్ర క్రీడా మైదానాలు

దయనీయంగా మారిన ముంపు బాధితుల బతుకులు - కొత్త ప్రభుత్వంపైనే కోటి ఆశలు

ABOUT THE AUTHOR

...view details