తెలంగాణ

telangana

ETV Bharat / state

అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం - తిరుమలలో వదిలేసి వెళ్లిపోయిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్​

తిరుపతిలో ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్వాకం - దర్శనం ఆలస్యం కావడంతో భక్తులను వదిలేసి వెళ్లిన డ్రైవర్‌

Private Travels Bus In Tirupati
Private Travels Bus In Tirupati (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Updated : 6 hours ago

Private Travels Bus In Tirupati: ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ నిర్వాకం భక్తులను ఇబ్బంది కలిగించింది. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. శబరిమల వెళ్లిన అయ్యప్ప భక్తులు తిరుగు ప్రయాణంలో శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చారు. దర్శనం ఆలస్యం కావడంతో 35 మంది అయ్యప్ప భక్తులను వదిలేసి బస్సులో ఉన్న బ్యాగులను కిందపడేసి డ్రైవర్‌ వెళ్లిపోయాడు.

దీంతో బాలాజీ లింక్‌ బస్టాండ్‌ వద్ద భక్తులు ఇబ్బందులు పడ్డారు. డయల్ 100కు అయ్యప్ప భక్తులు ఫోన్ చేయడంతో పోలీసులు స్పందించి నెల్లూరు టోల్‌గేట్‌ వద్ద బస్సును ఆపించారు. మరోవైపు అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో సదరు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యంపై అయ్యప్ప భక్తులు ఫిర్యాదు చేశారు.

Chakrateertha Mukkoti Tirumala :నేడు చక్రతీర్థ ముక్కోటి సందర్బంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాల్లో చక్రతీర్థ ముక్కోటి ఒకటి. పవిత్ర తిరుమల గిరుల్లో ఎన్నో పుణ్య తీర్థాలు ఉన్నాయి. కుమారధార, ఆకాశగంగ, పాపవినాశనం, చక్ర తీర్థం వంటి తీర్ధాలు తిరుమల పవిత్రతను మరింత పెంచుతున్నాయి. ఈ తీర్థాలకు ఏటా ముక్కోటి ఉత్సవం జరుగుతుంది.

తిరుమల చక్రతీర్థ ముక్కోటిని కళ్లారా చూస్తే చాలు- మోక్ష సిద్ధి ఖాయం!

తిరుమల లడ్డూకు పేటెంట్​ - ఎవరైనా తయారు చేస్తే చర్యలు - ఈ విషయాలు మీకు తెలుసా?

Last Updated : 6 hours ago

ABOUT THE AUTHOR

...view details