Private Bus Caught Fire in Nandyal District :తమిళనాడుకు చెందిన ఎన్ఎస్కే ట్రావెల్స్‌కు చెందిన బస్సులో నంద్యాల టోల్‌గేట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. బస్సు టైరుపేలి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. తిరువన్నామలై నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు గమనించి వెంటనే దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
టోల్ గేట్ వద్ద బస్సు నిలిపిననపుడు గమనించిన సిబ్బంది డ్రైవరుకు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవరు బస్సును నిలిపి అందులో ఉన్న ప్రయాణికులను దింపేశారు. దీంతో అందరు సురక్షితంగా ఉన్నారు.