Precautions to be Taken While Traveling :తెలంగాణలో ప్రధాన పండుగదసరా, అందులోనూ సెలవులు విద్యార్థులు, ఉద్యోగులు ఊరి బాట పడుతుంటారు ఇప్పుడు. లేదా సెలవుల కారణంగా పిల్లలతో పర్యాటక ప్రదేశాలకో, లేక ఆలయాలను చూడడానికి వెళ్తుంటారు. బస్సుల్లో, ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ నేపథ్యంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఏ మాత్రం కాస్త జాగ్రత్తగా లేకపోయినా విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశముంది. కాగా చోరీలు జరగడానికి కారణాలు, ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ కథనం
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కరీంనగర్ రీజియన్‌లో పరిధిలో రోజుకు గతంలో 2లక్షల మంది ప్రయాణించగా పండుగ కారణంగా ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 5లక్షలు వరకు పెరిగింది. రద్దీ విపరీతంగా పెరిగిపోయిన కారణంగా దొంగతనాలు పెరిగిపోయాయి.
- కరీంనగర్ బస్టాండ్‌లో చోరీలు పెరిగిపోతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఆదివారం రాజన్న సిరిసిల్ల నుంచి మంథని వెళ్లే క్రమంలో కరీంనగర్లో దిగిన ఓ ప్రయాణికురాలి బ్యాగులోంచి బంగారు ఆభలణాలు దొంగలించారు, సీసీ టీవీ ఫుటేజిని పోలీసులు పరిశీలించగా వివరాలు తెలియలేదు.
- ఓ ప్రయాణికురాలు సీటులో బ్యాగు ఉంచి తిరిగి వచ్చే సరికి మాయమైంది.
- బస్‌స్టాండు పరిధిలో ఓ మహిళా తాళి చోరీకి గురైంది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అపహరణకు గురవుతున్న ఘటనలూ ఉన్నాయి. వీటిని వెతికి పెట్టడం ఆర్టీసీ భద్రత సిబ్బందికి, పోలీసులకు తలనొప్పిగా మారింది.