తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహాలక్ష్మి'కే జై కొట్టిన మహిళామణులు - ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో తెలుసా? - Praja Palana Applications Upload

Praja Palana Applications in Telangana : తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ తుది దశకు చేరుకుంది. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇచ్చే పథకానికి అత్యధికంగా 92.23 లక్షల అర్జీలు వచ్చాయి. రూ.500కే గ్యాస్‌ సిలిండర్ల పథకానికి 91.49 లక్షల దరఖాస్తులు అందాయి.

Praja Palana Program in Telangana
Praja Palana Program in Telangana

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 12:33 PM IST

Praja Palana Applications in Telangana : రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. నెలకు రూ.2,500 ఇచ్చే ఈ పథకానికి ఎక్కువమంది మహిళలకు జైకొట్టారు. ఆ తర్వాత రూ.500కే గ్యాస్‌ సిలిండర్లకు, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ అర్జీలు అందాయి. అభయహస్తం గ్యారెంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలకు అర్జీకి అవకాశం కల్పించగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి.

ఉచిత కరెంట్‌కు బకాయిల షాక్ - ఎరక్కపోయి ప్రజాపాలన దరఖాస్తుతో ఇరుక్కుపోయి!

Praja Palana Program in Telangana : అందిన దరఖాస్తుల్లో 1,09,00,662 అర్జీలను(Praja Palana) ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది. జిల్లాల వారీగా అప్‌లోడ్‌ అయిన దరఖాస్తులన పరిశీలిస్తే, గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి అత్యధికంగా 18.97 లక్షలు ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి అత్యల్పంగా 1.37 లక్షలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తు ఫారంలో తమ అర్హతలను బట్టి పలు పథకాలకు అభ్యర్థన పెట్టుకున్నారు. అలా పథకాలవారీగా విభజించి చూస్తే, అందిన మొత్తం అభ్యర్థనల సంఖ్య 4,56,35,666 అవుతుంది.

క్రమసంఖ్య పథకం అభ్యర్థనల సంఖ్య
1 మహిళలకు రూ,2500 (మహాలక్ష్మి) 92,23,195
2 రూ.500కే గ్యాస్ సిలిండర్ 91,49,838
3 ఇందిరమ్మ ఇళ్లు 82,82,332
4 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహజ్యోతి) 81,54,158
5 రైతుభరోసా (భూమి ఉన్న రైతులకు రూ.15,000లు) 38,73,956
6 రైతుభరోసా (కౌలు రైతులకు రూ.15,000లు) 2,63,616
7 రైతుకూలీలకు రూ.12,000లు 40,95,581
8 ఉద్యమ అమరల కుటుంబాలకు 250 గజాల స్థలం 23,794
9 ఉద్యమకారులకు 250 గజాల స్థలం 84,659
10 దివ్యాంగుల పింఛన్లు 2,77,292
11 ఇతర పింఛన్లు 22,07,245

జిల్లాల వారీగా దరఖాస్తుల సంఖ్య

క్రమసంఖ్య జిల్లా దరఖాస్తుల సంఖ్య
1 ఆదిలాబాద్ 2,30,711
2 భద్రాద్రి కొత్తగూడెం 3,34227
3 జీహెచ్ఎంసీ 18,97,155
4 హనుమకొండ 2,54,472
5 జగిత్యాల 3,35,781
6 జనగామ 1,77,382
7 జయశంకర్ భూపాలపల్లి 1,37,454
8 జోగులాంబ గద్వాల 1,72,371
9 కామారెడ్డి 3,02,451
10 కరీంనగర్ 3,21,654
11 ఖమ్మం 4,90,902
12 ఆసిఫాబాద్ 1,63,647
13 మహబూబాబాద్ 2,47,213
14 మహబూబ్‌నగర్‌ 2,64,022
15 మంచిర్యాల 2,54,898
16 మెదక్ 2,25,594
17 మేడ్చల్ మల్కాజిగిరి 2,27,717
18 ములుగు 99,364
19 నాగర్‌కర్నూల్‌ 2,76,984
20 నల్గొండ 5,35,274
21 నారాయణపేట 1,70,479
22 నిర్మల్ 2,46,366
23 నిజామాబాద్‌ 4,80,294
24 పెద్దపల్లి 2,40,331
25 రాజన్న సిరిసిల్ల 1,92,622
26 రంగారెడ్డి 5,10,709
27 సంగారెడ్డి 3,91,565
28 సిద్దిపేట 3,25,214
29 సూర్యాపేట 3,75,094
30 వికారాబాద్ 2,84,275
31 వనపర్తి 1,74,794
32 వరంగల్ 2,90,834
33 యాదాద్రి భువనగిరి 2,68,812

Congress Six Guarantees in Telangana 2024 :మరోవైపు ఐదు గ్యారెంటీలు ఆశిస్తున్నవారు ఎందరున్నారనే అంచనా స్పష్టం కావడంతో, బడ్జెట్​పై సర్కార్ కసరత్తు చేస్తోంది. అర్జీల ప్రకారం ఏయే పథకానికి ఎంత ఖర్చవుతుందనే వివరాలు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని శాఖలు ప్రాథమిక అంచనాలు సమర్పించినట్లు సమాచారం. మొదట 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను (Gas Cylinder Scheme) వచ్చే నెలలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క

ఈ రెండు పథకాలకు విద్యుత్, గ్యాస్ కంపెనీల వద్ద వివరాలతో లబ్ధిదారులను ఎంపిక చేయడం సులువుగా ఉండడమే కారణమని సమాచారం. దీంతో పాటు మిగతా పథకాలతో పోలిస్తే నిధుల భారం కూడా కొంత తక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంస్థలు, గ్యాస్ కంపెనీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా కారణంతో నిధుల చెల్లింపు అప్పుడప్పుడు కొంత ఆలస్యమైనా ఇబ్బంది ఉండదని సూచించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఆరు హామీల్లో వీలైనన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేస్తోంది.

కోటి దాటిన ప్రజాపాలన దరఖాస్తులు - మరో మూడు పథకాల అమలుపై సర్కార్ కసరత్తు

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా పాలన : మంత్రి సీతక్క

ABOUT THE AUTHOR

...view details