Prabhas Drugs Awareness Video: కొత్త సంవత్సరం వేళ డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ వీడియో విడుదల చేశారు. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు ఉన్నాక డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు. జీవితంలో మనకు బోలెడన్నీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని, కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని, ఇక డ్రగ్స్‌కు నో చెప్పాలని (SAY NO TO DRUGS) పిలుపునిచ్చారు.
కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు స్పందించిన ప్రభాస్ తన వంతు సామాజిక బాధ్యతగా యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా ఉండేందుకు అవగాహన కోసం స్పెషల్ వీడియో విడుదల చేశారు. మనకి తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే వెంటనే 87126 -71111 నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రభాస్ సూచించారు. డ్రగ్స్‌కు బానిసలైన వాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
Tollywood Celebrities Awareness on Drugs: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలంటూ ఇప్పటికే పలువురు సినీ ప్రముకులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, సీనియర్ నటుడు మోహన్ బాబు సైతం డ్రసే నో టూ డ్రగ్స్ అంటూ వీడియో సందేశాలను విడుదల చేశారు. ఎంతో మంది యువత డ్రగ్స్‌కు బానిసలు అయి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటుున్నారని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీమ్‌కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా స్పెషల్ వీడియో సందేశాలను రూపొందించారు.