Power Supply Cut To Uppal Stadium :విద్యుత్ బకాయిలు చెల్లించలేదనే కారణంగా ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ శాఖ కరెంట్ సరఫరా నిలిపివేసింది. గతంలో విద్యుత్‌ను అక్రమంగా వినియోగించుకున్నందుకు ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేసినట్లు హబ్సిగూడ ఎస్.ఈ రాముడు పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) రూ.1,63,94,521లు వాడుకున్నట్లు విద్యుత్ శాఖ ఆరోపించింది.
ఉపయోగించిన కరెంట్ బిల్లును 15 రోజుల్లోపు చెల్లించాలని ఫిబ్రవరి 20వ తేదీన నోటీసులు కూడా ఇచ్చామని హబ్సిగూడ ఎస్.ఈ రాముడు తెలిపారు. అయినప్పటికీ ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు స్పందించకపోవడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరుజట్ల క్రికెట్ క్రీడాకారులు ఐపీఎల్ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం కూడా చేశారు. ఈ మ్యాచ్ ఎంతో కీలకమైన మ్యాచ్ కావున విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.
ఉప్పల్ మ్యాచ్‌కు మీరు వెళ్తున్నారా? - కచ్చితంగా ఇవి పాటించాల్సిందే!