Power Problems in Telangana :ఎండల తీవ్రత వల్ల పల్లెలు, పట్లాల్లో విద్యుత్తు, నీటి వినియోగం పెరిగింది. బోర్లు, బావులు, జలాశయాలతోపాటు భూగర్భ నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. పెరిగిన ఎండలతోపాటు రోజురోజుకూ విద్యుత్తు డిమాండ్ అధికమవుతోంది. ఈ పరిస్థితుల్ని గుర్తించిన ప్రభుత్వం కరెంటు, నీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్త్తు వ్యవస్థల సామర్థ్యం ఎంత? కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాలంటే ఎలాంటి ప్రణాళికలు అవసరం? కరెంటును, నీటిని వాడుకోవటంలో ఎలాంటి పొదుపు పాటించాలి?
కరెంట్, నీరు కష్టాలు ఎలా తీరు? - ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం చర్యలేంటి? - Power Problems in Telangana - POWER PROBLEMS IN TELANGANA
Power Problems in Telangana : తెలంగాణలో ఎండాకాలం మొదటి నుంచి కరెంటు కోతలు ప్రారంభమయ్యాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఎండాకాలం అంతా ఎలాంటి కరెంటు కోతలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం గురించి నేటి ప్రతిధ్వని.

Published : Apr 2, 2024, 10:52 AM IST
|Updated : Apr 2, 2024, 4:09 PM IST
కరెంటు, నీటి కష్టాలను అథిగమించటంలో ప్రభుత్వం పాత్రేంటి? ఏప్రిల్ నుంచి జూన్ వరకు బోర్లు, బావుల నుంచి తాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలంటే ప్రజలకు ఏఏ అంశాలపై అవగహన కల్పించాలి? పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు, తాగునీరు, సాగునీటి సరఫరాలు చేసేటప్పుడు కరెంటు కష్టాలు రాకుండా చూడాలంటే ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టాలి? పౌరుల బాధ్యతేంటి? ఇదీ నేటి ప్రతిధ్వని.