ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ రాయితీలని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్-చార్జీలు పెంచి మరమగ్గాల కార్మికులను కూలీలుగా మార్చాడు - Power Looms Electricity Charges - POWER LOOMS ELECTRICITY CHARGES

Power Looms Electricity Charges handlooms Problems : విద్యుత్‌ ఛార్జీల్లో రాయితీ కల్పించి నేతన్నల భుజం తట్టాల్సిన ప్రభుత్వం ట్రూఅప్‌ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు బిల్లుల పేరుతో అదనపు భారం మోపుతూ వారి నడ్డి విరుస్తోంది. జగన్‌ ప్రభుత్వ బాదుడు తట్టుకోలేని నేత కార్మికులు మగ్గం విడిచి కూలీలుగా బతుకు వెళ్లదీస్తున్నారు.

power_looms_electricity_charges_handlooms_problems
power_looms_electricity_charges_handlooms_problems

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 3:55 PM IST

Power Looms Electricity Charges handlooms Problems :విద్యుత్‌ ఛార్జీల్లో రాయితీ కల్పించి నేతన్నల భుజం తట్టాల్సిన ప్రభుత్వం ట్రూఅప్‌ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు బిల్లుల పేరుతో అదనపు భారం మోపుతూ వారి నడ్డి విరుస్తోంది. జగన్‌ ప్రభుత్వ బాదుడు తట్టుకోలేని నేత కార్మికులు మగ్గం విడిచి కూలీలుగా బతుకు వెళ్లదీస్తున్నారు. పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌, రాయితీలతో వారికి ఊతమిస్తుంటే జగన్‌ సర్కార్‌ మాత్రం తప్పుడు విధానాలతో బజారున పడేస్తుందని చిత్తూరు జిల్లా నేతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Power Looms Stopped: ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాలు.. ధర్మవరంలో మరమగ్గాలు నెల బంద్

అధికారంలోకి వస్తే 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామంటూ మరమగ్గాల కార్మికులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌ అందలమెక్కాక ఆ ఊసే మరిచారు. నేతన్నలకు లబ్ధి చేకూర్చకపోగా అదనపు వడ్డనతో వారిని రోడ్డుకీడ్చారు. కుటీర పరిశ్రమగా ఉన్న మరమగ్గాలను పరిశ్రమల కేటగిరీలోకి చేర్చి అదనపు బిల్లులు వసూలు చేస్తుండటంతో విద్యుత్‌ ఛార్జీలు అమాంతం పెరిగాయి. రాయితీల కోతతో పాటు విద్యుత్‌ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేతన్నల పాలిట శాపంగా మారిందని వాపోతున్నారు. నగరి నియోజకవర్గ పరిధిలో ఎన్నో ఏళ్లుగా మరమగ్గాలే సర్వస్వంగా జీవిస్తున్న నేత కార్మికుల కుటుంబాలపై విద్యుత్‌ ఛార్జీల పెంపు గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధర్మవరంలో మరమగ్గాల తనిఖీ

Power Looms Electricity Charges in Chitoor District :ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గంతో పాటు సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం మండలంలో దాదాపు 16 వేల కుటుంబాలు మరమగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నాలుగు మగ్గాలు ఉన్న కార్మికుడు నెలకు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు చెల్లించే వారు. వైఎస్సార్సీపీ గద్దెనెక్కాక పరిస్థితి తారుమారైంది. నెలకు 2 నుంచి రెండున్నర వేల రూపాయలు విద్యుత్‌ బిల్లు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూనిట్‌కు ఆరు పైసలు ఉండగా జగన్‌ ప్రభుత్వం రూపాయికి పెంచడంతో పాటు ట్రూఅప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో బాదుడు పెంచిందని నేతన్నలు వాపోతున్నారు.

ఆప్కో స్థలాలపై వివాదం.. చేనేత, జౌళి అనుబంధ రంగాలకే వాడాలని డిమాండ్

పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం 500 యూనిట్ల వరకు ఆ రాష్ట్రంలోని నేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతోపాటు వినియోగం వెయ్యి యూనిట్లు దాటితే ఒక్కో యూనిట్‌కు 70 పైసలు మాత్రమే వసూలు చేస్తోందని నగరి నియోజకవర్గ నేతన్నలు తెలిపారు. రాష్ట్రంలో మాత్రం అలాంటి విధానాలు కనిపించడం లేదు. నెల రోజులు కష్టపడితే ఎనిమిది నుంచి పదివేల రూపాయల ఆదాయం వస్తుంది. అందులో విద్యుత్‌ ఛార్జీలకే మూడు, నాలుగు వేలు ధారపోయాల్సి వస్తోందని ఇలాగైతే బతుకు బండి లాగేదెలా అని లబోదిబోమంటున్నారు.

'లక్కబొమ్మల గ్రామం వెలవెలబోతోంది'

మరమగ్గాల కార్మికులకు ఇచ్చిన హామీ మరిచావా జగనన్న

ABOUT THE AUTHOR

...view details