తెలంగాణ

telangana

ETV Bharat / state

షెడ్యూల్‌ కంటే అధికంగా కరెంట్ కోతలు - వినియోగదారులకు తప్పని అవస్థలు

Power Cuts in Telangana : తెలంగాణలో పలుచోట్ల కరెంట్ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో వేసవి సన్నద్ధతను దృష్టిలో ఉంచుకొని అధికారులు విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నిర్వహణ పనులను 15నిమిషాల నుంచి 2 గంటల లోపే ముగించాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ గంటలు కరెంట్ కోత విధిస్తున్నారు.

Power Cuts in Telangana
Power Cuts in Telangana

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 6:16 PM IST

Power Cuts in Telangana : రాష్ట్రంలో పలుచోట్ల కరెంట్ కోతలతో (Power Cuts) ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఉక్కపోత మరోవైపు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నారు. వేసవి సన్నద్ధతలో భాగంగా హైదరాబాద్‌లో విద్యుత్ మరమ్మతులు చేపట్టారు. దీనిపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉపకేంద్రాల నిర్వహణ దగ్గర్నుంచి లైన్ల మరమ్మతుల వరకు ఏదైనా రెండు గంటలు మించకూడదని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్ ఫరూకీ ఆదేశించారు. అయినా క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.

People Suffering Power Cuts : మూడు గంటలపాటు విద్యుత్ ఉండదని అధికారులు అధికారికంగానే ప్రకటిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2410 ఫీడర్లు ఉన్నాయి. రోజూ సగటున వంద ఫీడర్లలో మరమ్మతులు చేస్తున్నారు. 15నిమిషాల నుంచి 2 గంటల లోపే నిర్వహణ పనులు ముగించాలి. ఈ విషయాన్ని సీఎండీతోపాటు జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Minister Ponnam Prabhakar) కూడా స్పష్టం చేశారు. అందుకనుగుణంగా షెడ్యూల్‌ రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ గంటలు కరెంట్ కోత విధిస్తున్నారు.

రాష్ట్రంలో వ్యవసాయానికి కరెంట్‌ కోతలు.. ఆందోళనలో రైతులు..

Power Cuts in Hyderabad :హయత్‌నగర్‌ బొమ్మలగుడితో పాటు పలు కాలనీల్లో గురువారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల దాకా విద్యుత్‌ నిలిచింది. ఇదే ప్రాంతంలో వారం క్రితం కూడా కొమ్మల తొలగింపు పేరుతో సరఫరా నిలిపేశారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు కరెంట్‌ ఉండదని గురువారం రాజేంద్రనగర్‌ డివిజన్‌ వినియోగదారులకు సంక్షిప్త సందేశాలు వచ్చాయి. సనత్‌నగర్‌లో ఐదు రోజుల క్రితం నాలుగు గంటలకుపైగా విద్యుత్‌ లేదని స్థానికులు తెలిపారు. ఉష్ణోగ్రతలూ పెరగడంతో ఉక్కపోతతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామని వారు చెబుతున్నారు. సరిగ్గా వినియోగదారులు వచ్చే సమయాల్లో కరెంట్ పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వ్యాపారులు అంటున్నారు. తద్వారా ఆదాయం కోల్పోతున్నామని తెలియజేస్తున్నారు.

విద్యుత్​ కోతలతో ఉపాధికి 'కోత'.. తగ్గిన సామాన్యుడి ఆదాయం

వినియోగదారులకు సమాచారం ఇవ్వడం లేదనే ఫిర్యాదులు :మరోవైపు విద్యుత్‌ సమస్యలపై సులభంగా ఫిర్యాదు చేసేందుకు టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. ఇందులో కరెంట్ అంతరాయం ఉండే ప్రాంతాల వివరాలను సైతం అప్‌డేట్‌ చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని సెక్షన్లలో ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చడం లేదు. వినియోగదారులకు సమాచారం ఇవ్వడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి.

అప్రకటిత విద్యుత్‌ కోతలు.. తడారుతున్న వరి పంటలు..

అప్రకటిత కరెంట్‌ కోతలు.. ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు

ABOUT THE AUTHOR

...view details