Parents who Sold Their Daughter For Money :అమ్మ ప్రేమను అందుకోలేని దీనస్థితి, తండ్రి లాలనకు నోచుకోని దుస్థితి ఆ చిన్నారిది. తల్లిదండ్రుల సంరక్షణలో హాయిగా ఎదగాల్సిన ఆ పసిపాపను కన్న వాళ్లే అంగడిలో బొమ్మలా వేరేవారికి అమ్మకానికి పెట్టారు. ఆడపిల్ల జన్మించడంతో భారంగా ఆ తల్లితండ్రులు భావించారు. పిల్లల కోసం పరితపించి పోయే తల్లిదండ్రులను చూశాం. సంతానం కోసం కొందరు దేవుళ్లకు మొక్కులు, నోములు చేయడం చూశాం. కానీ మేడ్చల్ జిల్లాలో మాత్రం కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లిదండ్రులు పోషించే స్థోమత లేక ఆడ శిశువు అమ్మకానికి పెట్టారు. ఈ అమానవీయ ఘటనను ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి వెలుగులోకి తెచ్చారు అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పరువు పోతుందని బిడ్డను అమ్ముకుంది..
ఇదీ జరిగింది :అక్షరజ్యోతి ఫౌండేషన్‌కు చెందిన మహిళలు తమకు ఆడపిల్ల కావాలని స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే వీరు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణనగర్‌లోని శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో ఆర్ఎంపీ వైద్యురాలు శోభారాణిని సంప్రదించారు. 3నెలల ఆడ శిశువును రూ.4.50 లక్షలకు ఇప్పిస్తానని ఒప్పందం ఆమె ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్‌గా తీసుకుంది.