Polling Arrangements In Suryapet District :పార్లమెంట్ ఎన్నికలకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ పని విధానం కనబరిచి రాష్ట్రంలో అవార్డు తీసుకున్న జిల్లా యంత్రాంగం, ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో పని చేయాలని జిల్లా అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 1,201 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
District Collector On Polling :సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ కేంద్రం పరిధిలోనికి వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి, ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే జిల్లా కేంద్రం నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలను పంపించామని, సోమవారం ఉదయంకల్లా ఆయా పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సిబ్బందితో పాటు ఈవీఎంలు చేరుకుంటాయని తెలిపారు.
ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు పయనమైన సిబ్బంది
Special Arrangements For Disabled people :జిల్లాలో ఇంటి నుంచి ఓటేసేందుకు దరఖాస్తు చేసుకున్న 717 మంది వృద్ధులు, దివ్యాంగుల్లో 665 మంది తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 1,201 పోలింగ్ కేంద్రాల్లో 5,600 సిబ్బంది విధుల్లో ఉంటారని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 112 రూట్లలో 123 సెక్టార్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
- పురుష ఓటర్లు - 488,796
- స్త్రీ ఓటర్లు - 511,161
- పోలింగ్ కేంద్రాలు- 1201