ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హనుమ విహారి కెప్టెన్సీ తొలగింపు దుమారం - వైసీపీ సర్కారుపై విపక్షాల ముప్పేట దాడి - Nara Lokesh on Hanuma Vihari

Cricketer Hanuma Vihari Captaincy Removal: ఆంధ్రా రంజీ జట్టుకు కెప్టెన్‌గా హనుమ విహారి తొలగింపు వివాదం రాష్ట్రంలోని రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంద. క్రీడల పట్ల వైఎస్సార్​సీపీ అనుసరిస్తున్న తీరుపై ముప్పేట దాడి తీవ్రమవుతోంది. తమ పార్టీలోని ఓ నేత కోసం జాతీయ ఆటగాడ్ని ఇబ్బంది పెట్టడం, అధికార పార్టీ అహంకారానికి పరాకాష్ట అంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి.

hanuma_vihari_issue
hanuma_vihari_issue

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 1:46 PM IST

Updated : Feb 27, 2024, 2:42 PM IST

Cricketer Hanuma Vihari Captaincy Removal:ఆంధ్రా రంజీ జట్టుకు కెప్టెన్‌ స్థానం నుంచి హనుమ విహారిని తొలగించడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ అంశం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. హనుమ విహారిని కెప్టేన్సీ బాధ్యతల నుంచి తొలగించడంపై రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. ఆంధ్రా క్రికెట్​ అసోసియేషన్ కూడా రాజకీయాలకు లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కోన్నారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే భారత క్రికెటర్‌ కంటే ఓ వైకాపా నాయకుడే ముఖ్యమా? అంటూ జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెన్ని దిగజారుడు ఆటలు ఆడతారని ఏపీ పీసీసీ చీఫ్​ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్​సీపీ రాజకీయ కక్షలకు ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కూడా లొంగిపోవడం సిగ్గుచేటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రతిభావంతుడైన భారత, అంతర్జాతీయ క్రికెటర్ హనుమవిహారి ఆంధ్రప్రదేశ్ తరపున ఎప్పటికీ ఆడనని శపథం చేసేలా అతణ్ని వేధించారని చంద్రబాబు ఆరోపించారు. హనుమ విహారికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. విహారి దృఢంగా ఉండాలని, ఆట పట్ల అతనికున్న చిత్తశుద్ధిని వైఎస్సార్​సీపీ కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవని అన్నారు. అన్యాయమైన చర్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరని చంద్రబాబు అన్నారు.

క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందేనా? - వైసీపీ దెబ్బకు హనుమ విహారి ఔట్

ఏపీ తరపున ఆడేందుకు ఆహ్వానం: హనుమవిహారి అంశంలో ఆంధ్రా క్రికెట్​ అసోసియేషన్​ తీరును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఖండించారు. అధికార పార్టీ రాజకీయ జోక్యంతో ఆంధ్రా క్రికెట్ నుంచి ప్రముఖ క్రికెటర్ హనుమవిహారి చేదు నిష్క్రమణ ఆశ్చర్యం కలిగిస్తోందని లోకేశ్​ అన్నారు. రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ తరపున తిరిగి ఆడటానికి రావాలని హనుమవిహారిని ఆయన కోరారు. తాము హనుమ విహారి, అతని జట్టుకు రెడ్ కార్పెట్ ద్వారా స్వాగతం పలుకుతామని తెలిపారు. ఆంధ్రా క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీని గెలవడానికి అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తామని లోకేశ్​ హామీ ఇచ్చారు.

ఆంధ్రా క్రికెట్ జట్టుకు హనుమ విహారి గుడ్ బై - ఆ రాజకీయ నేత కుమారుడే కారణం!

ఆవేదన వ్యక్తం చేసిన జనసేనాని: హనుమ విహారికి సంఘీభావం తెలుపుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. భారత క్రికెటర్‌ కంటే వైఎస్సార్​సీపీ నాయకుడే ముఖ్యమా అని ప్రశ్నించారు. గాయాలైనా ఏపీ రంజీ జట్టు కోసం హనుమ విహారి ఆడాడని పవన్‌ వివరించారు ఏపీ రంజీ జట్టు నాకౌట్‌ చేరడంలో హనుమ విహారిది కీలకపాత్ర అని గుర్తు చేశారు. వైఎస్సార్​సీపీ నేత వల్లే హనుమ విహారి కెప్టెన్సీకి రాజీనామా చేశారని పవన్‌ గుర్తు చేశారు. ఏసీఏ విహారి పట్ల చూపించిన తీరుకు చింతిస్తున్నానని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాల సీట్లు, పొత్తుల గురించి అధికార పార్టీకి ఎందుకు? : గాదె వెంకటేశ్వరరావు

వైఎస్సార్​సీపీ దౌర్భాగ్య రాజకీయాలు : క్రికెటర్‌ హనుమ విహారి అంశంలో ఆంధ్రా క్రికెట్​ అసోసియేషన్ నిర్ణయంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. క్రీడలపైనా వైఎస్సార్​సీపీ దౌర్భాగ్య రాజకీయాలా అంటూ ఆమె మండిపడ్డారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేముంటుందంటూ ఆమె విమర్శలు గుప్పించారు. అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్నారని, రాష్ట్ర ప్రతిష్ఠను అన్నివిధాలా నాశనం చేశారని అన్నారు.

ఆడుదాం ఆంధ్ర అంటూ 2 నెలలు సినిమా స్టంట్స్‌ చేశారని షర్మిల దుయ్యబట్టారు. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా అంటూ ప్రశ్నించారు. అది ఆంధ్రా క్రికెట్ అసోసియేషనా, అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిస్పాక్షిక విచారణ జరగాలని ఆమె డిమాండ్​ చేశారు. క్రీడలపై వైఎస్సార్​సీపీ క్రీనీడలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంకెన్ని దిగజారుడు ఆటలు ఆడతారు వీళ్లు అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ-జనసేన రెండో జాబితాపై ఉత్కంఠ - కొనసాగుతున్న నేతల ప్రయత్నాలు

క్రికెటర్లనూ వదలడం లేదు :జగన్‌ ప్రభుత్వం ఆంధ్రా క్రికెట్​ అసోసియేషన్ పరువు తీస్తోందని టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ విమర్శించారు. వైఎస్సార్​సీపీ అరాచకం క్రికెటర్లను కూడా వదలడం లేదన్నారు. రాజకీయ నేత కుమారుడి కోసం విహారిని కెప్టెన్ నుంచి తొలగిస్తారా అంటూ ప్రశ్నించారు. క్రికెట్ రంగంలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువైందని అన్నారు. క్రికెటర్ హనుమ విహారిని జగన్‌ అండ్‌ టీమ్‌ ఇబ్బంది పెట్టిందని పేర్కోన్నారు.

ఉభయగోదావరి జిల్లాలపైనే జనసేన ఫోకస్​ - భీమవరం నుంచే పవన్​ !

Last Updated : Feb 27, 2024, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details