తెలంగాణ

telangana

ETV Bharat / state

సంధ్య థియేటర్​ ఘటనపై సోషల్​ మీడియాలో పోస్టులు చేస్తున్నారా - పోలీసు వారి హెచ్చరిక ఇదే - PUSHPA 2 STAMPEDE CASE

సంధ్య థియేటర్ ఘటనపై తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు - ప్రజలను తప్పుదోవపట్టించే పోస్టులు పెట్టవద్దని హెచ్చరిక - ఘటన ఆధారాలు, సమాచారం ఉంటే అందించాలని విజ్ఞప్తి

POLICE WARNED ABOUT FAKE POSTS
Police warned about misinformation in stampede case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2024, 1:24 PM IST

Updated : Dec 25, 2024, 2:00 PM IST

Pushpa 2 Stampede Case : సంధ్య థియేటర్​లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎవరైనా సోషల్​ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్​ పోలీసులు హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవపట్టించే పోస్టులను గుర్తించిన పోలీసులు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు శాఖను అప్రతిష్ఠపాలు చేసే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై సామాజిక మాధ్యమాల్లో సమాచారంతో పాటు ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్​ పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసు శాఖను బద్నాం చేసేలా : సినీ నటుడు అల్లుఅర్జున్​ రాకముందే సంథ్య థియేటర్​లో తొక్కిసలాట జరిగినట్లు తప్పుడు వీడియోలను కొందరు పోస్టు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్​ పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ చేసిన క్రమంలో తెలిసిన నిజాలను ఇప్పటికే వీడియో రూపంలో విడుదల చేసినట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు పోస్ట్‌లు పెడితే, దాని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన ఎవరి దగ్గరైన ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే తమకు అందించవచ్చని పోలీసులు కోరారు.

ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు : ''సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్​గా పరిగణిస్తాం. కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం'' అని హైదరాబాద్​ పోలీసులు ఎక్స్​ వేదికగా హెచ్చరించారు.

'రేవతి చనిపోయిన విషయం నాకు ఎవరూ చెప్పలేదు' - పోలీసుల విచారణలో అల్లుఅర్జున్‌ భావోద్వేగం ​

అల్లు అర్జున్​పై కేసు వెనక్కి తీసుకుంటాను : శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌

Last Updated : Dec 25, 2024, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details