Joy Zamina in Visakha Honey Trap Case :ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగా మేసేజ్లతో ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత పర్సనల్గా కలుద్దామని చెబుతారు. టెంప్ట్ అయి ముందడుగు వేస్తే అందినకాడికి దోచేస్తారు. ఈ కోవలోకే విశాఖ ఘటన వెలుగులోకి రావడంతో ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.
Vizag Honey Trap Case : విశాఖలో హనీట్రాప్‌నకు పాల్పడి ఎందరినో వేధించిన కిలాడీ లేడి జాయ్ జెమీనాను పోలీసులు ఒక రోజు కస్టడీకి తీసుకున్నారు. కంచరపాలెం పోలీసులు ఆమెని విచారించారు. మత్తు ఎక్కడి నుంచి వస్తుంది అనే అంశాలపై ప్రశ్నించారు. జెమినా ఫోన్ లాక్ ఒపెన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. మరో వైపు జెమినా బెదిరింపులకు బాధితులు రాష్ట్రాలు వదిలి వెళ్లిపోయారని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
అందం, డ్రగ్స్ ఆ తర్వాత డబ్బు- విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు - Visakha Honey Trap Case
విశాఖలో హనీట్రాప్‌నకు పాల్పడిన జాయ్ జెమీనా వెనుక ఉన్న ముఠా గుట్టురట్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. కంచరపాలెం పోలీసులు జెమీనాని కస్టడీకి తీసుకుని విచారించారు. విశాఖ మురళీ నగర్ ఎన్జీవోస్ కాలనీలో నివసించే జెమీనా ఉన్నత విద్యావంతురాలు. అతి తక్కువ కాలంలోనే కోటీశ్వరరాలు కావాలనే కుట్రతో అందం ఎరగా వేసి,పేరు, డబ్బు ఉన్న యువకులు, మధ్య వయస్కులను బురిడీ కొట్టించింది. ఫోన్లు, వాట్సప్, ఇన్‌స్టాగ్రాం ద్వారా దగ్గరై చాలా మంది వద్ద లక్షల రూపాయలు కొల్లగొట్టింది. ఆమెకు ఒక ముఠా తోడు దొరకడంతో మత్తు మందు కూడా సంపాదించి మరిన్ని దారుణాలకు ఒడిగట్టింది. మత్తు కలిపిన డ్రింక్ తాగించి ప్రైవేటు ఫోటోలు, వీడియోలు చిత్రీకరించేది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించి డబ్బు డిమాండ్ చేసేది. ఒక్కరి నుంచే సుమారు 25 లక్షలు రూయాలకుపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెని అరెస్టు చేశారు. కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైన పోలీసులు జెమీనాని ఒకరోజు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. ఫోన్ లాక్ ఒపెన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. బాధితులను లొంగతీసుకోవడానికి వాడిన మత్తు ఎక్కడి నుంచి వస్తుందనే కోణంలో విచారించారు. త్వరలోనే కేసును పూర్తి స్థాయిలో ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.
ఇన్స్టాలో వలపు వల - ఎన్నారైని రప్పించి కిడ్నాప్ చేసిన జమీనా - విచారణలో పోలీసులు షాక్ - Woman Kidnapped NRI in Visakha