ఈ నెల 18లోపు విచారణకు హాజరవ్వండి - హీరో రాజ్‌తరుణ్‌కు పోలీసుల నోటీసులు - Police Issued Notices to Raj Tarun
Actor Raj Tarun Case Update : హీరో రాజ్ తరుణ్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 18లోపు తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 12:27 PM IST
Police Issued Notices to Actor Raj Tarun : సినీ నటుడు రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారిపోయింది. తాజాగా రాజ్‌తరుణ్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 18లోపు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు వెల్లడించారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్‌తరుణ్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 'రాజ్‌తరుణ్ నన్ను ప్రేమించి మోసం చేశాడు' - పోలీసులకు ప్రేయసి ఫిర్యాదు - Case on Hero Raj Tharun