Police Interrogating Vallabhaneni Vamsi:విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి పోలీసు ఉన్నతాధికారులు వంశీని విచారిస్తున్నారు. పటమట పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో వంశీకి ఆధారాలు చూపించి వివరణ తీసుకుంటున్నారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారనే అభియోగాలతో వంశీపై కేసు నమోదు అయ్యింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద వంశీపై కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో బాధిత కుటుంబం తెలిపిన వివరాలపై వంశీ నుంచి పోలీసులు వివరణ తీసుకున్నారు. విచారణ అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం వంశీని విజయవాడ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో జడ్జి ముందు వంశీని ప్రవేశపెట్టనున్నారు. వల్లభనేని వంశీకి రిమాండ్ విధించాలని పోలీసులు జడ్జిని కోరనున్నారు.
నా నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలని వారు భావిస్తున్నారు- ఎమ్మెల్యే చింతమనేని