Police Arrest Suspect Murdered Disabled Man from Kuwait : అన్నమయ్య జిల్లాలో కలకలం సృష్టించిన దివ్యాంగుడు ఆంజనేయులు (59) హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడైన ఆంజనేయప్రసాద్, ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ కుమార్తె (12) పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంజనేయులును స్వయంగా తానే హత్య చేసినట్లు నిందితుడు తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ఆంజనేయప్రసాద్ ప్రకటించారు.
తానే పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అనంతరం నిందితుడిని తమిళనాడులో పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడే లొంగిపోయాడా? లేక అతడు కువైట్ నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చినప్పుడు పట్టుకున్నారా? అనే విషయంపై స్పష్టత లేదు. నిందితుడు ఆంజనేయప్రసాద్ అరెస్టును పోలీసులు ఈరోజు(శుక్రవారం) ప్రకటించే అవకాశం ఉంది.
అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కువైట్ నుంచి వచ్చి ఒకరిని హత్య చేయడం రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన కుమార్తెను వేధించిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్లే తాను హత్య చేశానంటూ నిందితుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఉపాధ్యాయుడిపై విద్యార్థుల దాడి! - ఊపిరాడక మృతి
బాలిక పట్ల అసభ్య ప్రవర్తన : అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు శనివారం తెల్లవారు జామున దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈలోగా హత్య తానే చేశానంటూ నిందితుడు సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టాడు. నిందితుడు తన భార్యతో కలిసి కువైట్‌లో ఉంటున్నాడు. కుమార్తెను మాత్రం నిందితుడి తన భార్య సోదరి వద్ద ఉంచాడు. ఆ బాలిక పట్ల వరుసకు తాతయ్యే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని బాలిక కువైట్‌లో ఉంటున్న తన తల్లికి ఫోన్ చేసి తెలిపింది. వెంటనే కువైట్ నుంచి బయలుదేరి ఓబులవారిపల్లి వచ్చిన బాలిక తల్లి జరిగిన ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ : వికలాంగుడైన నిందితుడిని పిలిచి పోలీసులు మందలించి వదిలేశారు. ఈ విషయాన్ని బాలిక తల్లి తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. న్యాయం జరగలేదని తీవ్ర ఆవేదనకు గురైన బాలిక తండ్రి కువైట్ నుంచి సొంతూరికి వచ్చి శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దివ్యాంగుడిపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. అక్కడి నుంచి వెంటనే మళ్లీ కువైట్ కి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని వివరిస్తూ నిందితుడు సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశాడు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసినది న్యాయమేనని పోలీసులకు లొంగిపోతానని వీడియోలో వాపోయారు. స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదనే ఆవేదనతోనే హత్య చేసినట్లు తెలిపాడు. వికలాంగుడిని హత్య చేసిన నిందితుడిని ఓబులవారిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పొలంలో మృతదేహం- కాళీమాత గుడిలో రక్తం- హత్య చేశారా? బలిచ్చారా?
కోరిక తీర్చలేదని మహిళ కుమారుడి హత్య - నిందితుడు వరుసకు మేనమామ