Police Arrest 3 Accused for Cheating With Fake IDs in Tirumala :తిరుమలలో స్వామి వారి దర్శనం కల్పిస్తామని నకిలీ ఐడీలతో మోసగించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఎన్సీసీ క్యాంటీన్ మేనేజర్ బ్రహ్మయ్య విశ్రాంత సైనికాధికారిని మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. పదవీ విరమణ చేసిన సైనికాధికారి గుర్తింపు కార్డులో హోదా మార్చి విధి నిర్వహణలో ఉన్నట్లు బ్రహ్మయ్య నకిలీ ఐడీ తయారు చేశాడు. బ్రిగేడియర్‌గా హోదా మార్చి నిందితుడు బ్రహ్మయ్య నకిలీ ఐడీ రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ నకిలీ ఐడీతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందిన బ్రహ్మయ్య 2 వేల రూపాయల విలువ చేసే 4 టికెట్లను 40 వేలకు విక్రయించారు. ఈ వ్యవహారంలో తిరుమల పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. బ్రహ్మయ్యతోపాటు అక్రమాలకు సహకరించిన బంధువు రాజు, ఐడీ కార్డును నకిలీ చేసేందుకు సహకరించిన జిరాక్సు షాపు యజమానిపై కేసు నమోదుచేశారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.