PM Modi MP Election Campaign in Telangana :తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అగ్రనేతలు ప్రచాబరిలోకి దిగారు. పదిరోజుల వ్యవధిలోనే తెలంగాణలో మరోసారి అడుగుపెట్టిన ప్రధాని మోదీ, నేటి నుంచి మూడురోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) మలివిడత ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి విచ్చేసిన మోదీకి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఇటీవల మరికొంతమంది బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్ర పర్యటన నిమిత్తం కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని, అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో మల్కాజిగిరి చేరుకున్నారు. నియోజకవర్గ పరిధిలో బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ మోదీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి ఈటల రాజేెందర్ సహా పలువరు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సాగిన భారీ ర్యాలీలో(BJP Rally) పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. అశేష జనవాహినితో రోడ్లన్నీ కాషాయమయంగా మారాయి. దీంతో సర్వత్రా మోదీ నామజపంతో మల్కాజిగిరి ఒక్కసారిగా మార్మోగింది.
'వచ్చే ఐదేళ్లలో జెట్ స్పీడ్‌లో అభివృద్ధి- ఇండియా కూటమికి నిద్రపట్టడం లేదు!'