PM Modi Inaugurates 114 National Highway Projects :దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయల విలువైన 114 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు హరియాణాలోని గురుగ్రామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి బీజీపీ నేతలు, మంత్రులు, అధికారులు వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోనే 29 వేల 395 కోట్లతో 1134 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికే పూర్తైన 6 జాతీ రహదారులను జాతికి అంకితం చేశారు. 12 జాతీయ రహదారుల పనులను ప్రధాని శంకుస్థాపన చేశారు. విజయవాడ లోని నువాటెల్ హోటల్లో కార్యక్రమంలో పాల్గొన్న ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
Modi Inaugurates National Highway :ఆంధ్రప్రదేశ్‌లో 2 వేల 950 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి జాతీయ రహదారి, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హరియాణా సెక్షన్, 4 వేల 600 కోట్లతో నిర్మించిన లఖ్‌నవూ రింగ్ రోడ్, జాతీయ రహదారి 21లో భాగంగా 3 వేల 400 కోట్ల రూపాయలతో హిమాచల్ ప్రదేశ్‌లో నిర్మించిన కిరాత్‌పూర్- నెర్‌చౌక్ సెక్షన్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో 20 వేల 500 కోట్ల రూపాయల విలువైన 42 ప్రాజెక్టులను మోదీ ఆరంభించారు.
అంతేకాకుండా జాతీయ రహదారులకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో 14 వేల కోట్ల రూపాయలతో నిర్మించనున్న బెంగళూర్-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే కూడా ఉంది. ఇది కాకుండా వివిధ రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అనేక జాతీయ రహదారుల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దేశంలో లక్షల కోట్లరూపాయల అభివృద్ధి పనులు చూసి వారికి నిద్ర పట్టడం లేదని అన్నారు.
జాతీయ రహదారి విస్తరణలో జాప్యం - కొన్నిచోట్ల కిలోమీటర్ కూడా పూర్తి చేయని కాంట్రాక్టర్లు