Case Filed On Director RGV In Maddipadu : సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా, మార్ఫింగ్ ఫొటోలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం సిగ్గుపడేలా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ విషయంలో పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. మరికొందరిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఇంటూరి రవి కిరణ్, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇలా పలువురని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్, నారా బ్రాహ్మణిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే,,
Ram Gopal Varma on Nara Chandrababu Naidu : సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం రామ్‌గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేరుకే ఆర్జీవీ - కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా వైసీపీనే: కొలికపూడి
Ram Gopal Varma on Pawan Kalyan : రామ్‌గోపాల్ వర్మపై గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీసుల కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీం రైతు విభాగం ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో తుళ్లూరు పోలీసుల వర్మపై కేసు నమోదు చేశారు.