ETV Bharat / entertainment

సంక్రాంతి రేసులో 4 సినిమాలు! - అయినా ఈ సీజన్‌ వారిద్దరిదే! - 2025 SANKRANTHI RELEASE MOVIES

2025 సంక్రాంతికి నాలుగు కొత్త సినిమాలు - ఆ ఇద్దరికీ వెరీ ఇంపార్టెంట్!

2025 Sankranthi Release Movies
2025 Sankranthi Release Movies (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 1:23 PM IST

2025 Sankranthi Release Movies : తెలుగు రాష్ట్రాల్లో జనవరి అనగానే భోగి, సంక్రాంతి పండగలే కాదు కొత్త సినిమాల సందడి కూడా మొదలవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే, ఈసారి కూడా చాలా సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతానికి రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'NBK109 (వర్కింగ్ టైటిల్‌)', వెంకటేశ్​ 'సంక్రాంతికి వస్తున్నాం', సందీప్ కిషన్ 'మజాకా' సినిమాలు రేసులో ఉన్నట్లు స్పష్టమైంది. ప్రస్తుతం ఇవన్నీ కూడా షూటింగ్, పోస్ట్​ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.

మరోవైపు ఈ పండగ సీజన్‌లో భారీ బడ్జెట్‌ సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల వందల కోట్ల డబ్బు ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా 2025 సంక్రాంతి సీజన్‌లో ఇద్దరు కీలకం కానున్నారు.

దిల్‌ రాజు 'గేమ్‌ ఛేంజర్‌' అవుతారా?
రాబోయే సంక్రాంతికి విడుదలయ్యే నాలుగు సినిమాల్లో మూడు దిల్ రాజుకి చెందినవే కావడం విశేషం. 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలకు ఆయనే నిర్మాత. అలాగే 'NBK109' మూవీకి నైజాంలో డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజుకి 2024వ ఏడాది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఆయన నిర్మాతగా 'ఫ్యామిలీ స్టార్', 'లవ్ మీ', 'జనక అయితే గనక' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయాయి. అలానే నైజాంలో మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం' మూవీకి డిస్ట్రిబ్యూషన్‌ బాధ్యతలు తీసుకున్నారు. అది కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ఇప్పుడు దిల్‌ రాజుకు 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం', 'NBK109' విజయాలు చాలా కీలకం. ప్రధానంగా భారీ బడ్జెట్‌ సినిమా 'గేమ్ ఛేంజర్' సక్సెస్‌ అవ్వడం ముఖ్యం.

మళ్లీ హ్యాట్రిక్‌ వస్తుందా?
ఈ సంక్రాంతిని అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న మరో సంస్థ యూఎస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ శ్లోకా ఎంటర్టైన్మెంట్స్. 2023లో ఈ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ నార్త్​ అమెరికాలో 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహా రెడ్డి', 'వారసుడు' రిలీజ్‌ చేసింది. ఇప్పుడు 2025 సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్', 'NBK109', 'సంక్రాంతికి వస్తున్నాం' రిలీజ్‌ చేస్తోంది. వీటిపై చాలా పెట్టుబడి పెట్టింది. ఈ సారి కూడా హ్యాట్రిక్‌ విజయాలు అందుకోవాలని ఆసక్తిగా ఉంది.

'ఎన్​బీకే 109' టీజర్ - స్పెషల్ అప్​డేట్​ ఇచ్చిన తమన్​!

సంక్రాంతి 'గేమ్‌ ఛేంజ్‌' - పండగ బరిలో ఏఏ సినిమాలు వస్తున్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.