ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్​లో స్థిరాస్తి వ్యాపారమా! - బీ అలర్ట్!

హైదరాబాద్​లో అనుమతులు రాకుండానే ప్లాట్లు, ఇళ్లు అమ్మకం - హెచ్‌ఎండీఏ, డీటీసీపీ పేరుతో దందా - ఇవి ఉన్నాయో లేవో ఇలా తెలుసుకోండి?

house_sales_scams_in_hyderabad
house_sales_scams_in_hyderabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 5:35 PM IST

Plots and House Sales Scams in Hyderabad:హైదరాబాద్​లో ఇళ్లు, ప్లాట్ల రేట్లు పెరగడంతో పాటు వివాదాలూ పెరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ మోసాలతో కొనుగోలుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే ఏదైనా ప్లాట్, ఇల్లు కొనేటప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు ఒకటికి రెండు సార్లు గమనించి ఆలోచించి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా!

హైదరాబాద్​ శివారులో తక్కువ ధరకే లే అవుట్ ఉందని దీనికి హెచ్ఎండీఏ లేదా డీటీసీపీ అనుమతులు తీసకున్నామని ఎవరైనా ప్లాట్లు లేదా ఇళ్లు అమ్మకానికి పెడితే ఆలోచించుకొని తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. కొందరు మోసగాళ్లు లేఅవుట్ లేదా భవనాల నిర్మాణాలకు హెచ్ఎండీఏ, డీటీసీపీలకు దరఖాస్తు చేసుకొని అనుమతులు రాకముందే ప్లాట్లు, ఇళ్లను అమ్ముతున్నారు. ముఖ్యంగా శంషాబాద్, మేడ్చల్, శంకర్​పల్లి జోన్లలో ఈ దందా ఎక్కువగా జరుగుతోంది.

చిట్టి చేతులు చూడ చక్కని చిత్రాలు - ముద్దులొలికే బొమ్మలతో మనసు దోచుకున్న చిన్నారులు

కొనేటప్పుడు ఇవి గమనించండి:రంగారెడ్డి జిల్లా కొందుర్గులో 421 ఎకరాల్లో లేఅవుట్‌ ఉందని, డీటీసీపీ అనుమతులు కూడా ఉన్నట్లు అవతలి వ్యక్తులు చెప్పడంతో ఓ వ్యక్తి గుడ్డిగా నమ్మి వారికి దాదాపు రూ.30 లక్షలపైనే ఇచ్చి మోసపోయాడు. విషయం తెలుసుకొని లబోదిబోమంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని లే అవుట్లకు, 5 అంతస్తులు అంతకు మించిన భవనాలకు హెచ్‌ఎండీఏ, జిల్లాల్లో డీటీసీపీ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. హెచ్‌ఎండీఏ నుంచి ఎల్‌పీ నంబరు, డీటీసీపీ సంబంధించి అనుమతుల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలి.

ఎలాంటి ప్లాట్లు తీసుకోవాలి: ముఖ్యంగా లే అవుట్లలో ప్లాట్లు కొనేముందే భూ యజమాని వివరాలు, లింకు డాక్యుమెంట్లు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి. మార్టిగేజ్‌ ప్లాట్లను అంటగట్టడానికి చాలామంది చూస్తుంటారు. ప్లాట్లు తక్కువకే అమ్ముతున్నామని చెప్తుంటారు. మార్టిగేజ్‌లో ఉన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదు సరికదా అందులో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వరు. ఈ విషయం గ్రహించిన తరువాతే ప్లాట్లు తీసుకోవాలి. కోర్టు కేసులు, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో ఉన్న ప్లాట్లు, ఇళ్లు ఎంత తక్కువకు విక్రయించాలని చూసినా సరే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. లే అవుట్​లో మౌలిక వసతుల కల్పన, మార్టిగేజ్‌ ప్లాట్లు ఉన్నాయా అనే విషయాలు తెలుసుకోవాలి.

వేడుక ఏదైనా డ్రోన్ ఉండాల్సిందే - వినువీధిలో వండర్ విజువల్స్

వెయిట్ లిఫ్టింగ్​లో విజయనగరం సిస్టర్స్ - కామన్​వెల్త్ పోటీల్లో విజేతలు

ABOUT THE AUTHOR

...view details