Plasma Exhibition Held in PB Siddartha College at Vijayawada :కళాశాలల్లో బోర్డులపై రాసే దానికి విద్యార్థులకు ప్రాక్టికల్‌గా చూపేదానికి ఎంతో తేడా ఉంటుంది. నేరుగా చూపిస్తే మనసును హత్తుకుంటుంది. అందుకే శాస్త్రసాంకేతిక యుగంలో ఎంతగానో ఉపయోగపడుతోన్న ప్లాస్మాతో చేసిన ప్రయోగాల్ని ఇలా ప్రదర్శించారు. గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్‌తో కలిసి విజయవాడ పీవీ సిద్ధార్థ కళాశాల ఈ ఎగ్జిబిషన్ నిర్వహించింది.
ప్లాస్మా ఎగ్జిబిషన్ :కొత్త విషయాలు నేర్చుకోవాలనే మక్కువతో కళాశాల ఇచ్చిన ప్రోత్సహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేస్తుకున్నారు. ప్లాస్మా ఎలా తయారుచేస్తారనే అంశంపై అవగాహన పొందారు. సాధారణంగా హై ఓల్టేజి ప్రెజర్ దగ్గర ప్లాస్మా తయారవుతుంది. ఈ గ్లో డిశ్చార్జ్ యంత్రం ద్వారా ప్లాస్మా తయారీని స్పష్టంగా చూడవచ్చు. ప్లాస్మా టీవీలు ఇలా వచ్చినవే. భవిష్యత్తులో ప్లాస్మా వాహనాలను కూడా చూడవచ్చని చెబుతున్నారు విద్యార్థులు.
కర్ణాటకలో నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ - తెలుగువారి గొప్పతనాన్ని చాటిన విద్యార్థులు - national integration Camp 2024
ప్లాస్మా ఉపయోగాలపై అవగాహన :ప్లాస్మాను వ్యక్తిగత సౌందర్య సంరక్షణలోనూ ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ముఖంపై మొటిమలు ఉంటే ప్లాస్మా గ్రూమింగ్ ద్వారా సరిచేసుకోవచ్చు. ముడతలు నివారించ వచ్చు. వెంట్రుకల పెరుగుదల కూడా సాధ్యమంటున్నారు విద్యార్థులు. వస్త్రాల డిజైన్లు రూపొందించేటప్పుడు అద్దకాల కోసం రకరకాల రంగులు వాడతాం. దీనివల్ల కాలుష్యమే కాక పెద్దమొత్తంలో నీరు వృధా పోతోంది. అలాకాకుండా ప్లాస్మాను వినియోగిస్తే అన్ని రకాలుగా మేలుంటుందని చెబుతున్నారు విద్యార్థులు. దుస్తువులపై కలర్ ఫేడ్ కావడానికి రసాయనాలు ఉపయోగిస్తారు. అలాకాకుండా ప్లాస్మాతో తయారు చేసిన లోప్రెజర్‌లో కోల్డ్ ప్లాస్మా ద్వారా సహజ పద్ధతిలో దుస్తులకు రంగులు వేయొచ్చు.
కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదిక - ఇంజినీరింగ్ కాలేజీల్లో స్పేస్ డే వేడుకలు - National Space Day Celebrations
ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్న విద్యార్థులు :ప్లాస్మాతో పనిచేసే మరో పరికరం టెల్సా కాయల్ అండ్ ఆర్ఎఫ్ ప్లాస్మా. దీని దగ్గరకు ఎలాంటి కనెక్షన్ లేని విద్యుత్ లైట్లు తీసుకువెళ్తే ఆటోమేటిక్‌గా వెలుగుతుంది. కేవలం ప్లాస్మాలోని విద్యుత్ ఆయస్కాంత తరంగాల వల్ల ఇవి వెలుగుతున్నాయి. ఇళ్లలో వాడే ప్లాస్మా ట్యూబ్‌లైట్లు ఇవే కోవకు చెందుతాయి. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని పరికరాలకు ప్లాస్మాను విస్తరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. జపాన్ వంటి దేశాల్లో అయస్కాంత రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వెనుక విద్యుత్ ఆయస్కాంత తరంగాలే కీలకం. సూపర్ కండక్టర్ వస్తువును మైనస్ 181 సెంటీగ్రేటెడ్ కింద కూల్ చేసినప్పుడు డయామేగ్నటిక్ కింద మారుస్తారు. దీనిని అయస్కాంత క్షేత్రం మీద ఉంచినప్పుడు సహజంగానే రెండూ వికర్షిస్తాయి. దీని ఆధారంగానే ఆయస్కాంత రైళ్లను నడపవచ్చు. అలాగే ఇంట్లో వినియోగించే కరెంట్‌నూ ఆదా చేయోచ్చని విద్యార్థులు చెబుతున్నారు.
హాబీతో ప్రత్యేకత చాటుకున్న యువకుడు - నాణేల సేకరణతో అంతర్జాతీయ రికార్డులు - RAVITEJA COINS COLLECTIN
విద్యార్థులను ఆలోచింపజేసిన ఎగ్జిబిషన్ :ప్లాస్మా ప్రదర్శనను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తరలివచ్చారు. పరిశోధన రంగం వైపు తొంగిచూసే విద్యార్థులకు ఇది ఉపయుక్తంగా ఉందని బోధకులు, విద్యార్థులు అంటున్నారు. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని నిర్వహించాలని కోరుతున్నారు. ప్లాస్మా ఎగ్జిబిషన్స్ వంటివి విద్యార్థుల్లో జిజ్ఞాసను రేకెత్తిస్తాయి. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని నిర్వహించేందుకు విద్యాసంస్థలు ముందుకు రావాల్సిన అసవరముంది.
ఒలంపిక్స్‌లో పసిడి పతకమే లక్ష్యం - పవర్‌లిఫ్టింగ్‌లో గుంటూరు యువ క్రీడాకారుడు సత్తా - Power Lifter Bharat Kumar