తొలిరోజు ముగిసిన రాధాకిషన్‌రావు కస్టడీ- విభిన్న కోణాల్లో పోలీసుల విచారణ Phone Tapping Case Updates :రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ జోరుగా సాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడైన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును(Radhakishan Rao) కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న కీలక అంశాలపైనే తొలిరోజు ప్రశ్నించినట్లు సమాచారం.
నా ఫోన్ ట్యాప్ చేసి రూ.కోట్లు వసూలు చేశారు - రాధాకిషన్‌రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు - phone tapping case updates
ఫోన్ ట్యాపింగ్ సమాచారం ద్వారా పలువురి వద్ద నుంచి సీజ్ చేసిన నగదు ఏం చేశారు? ఎవరి ఆదేశాల మేరకు నగదు సీజ్ చేశారు? ఎవరెవరి వద్ద నగదు పట్టుకున్నారనే? కోణాల్లో పోలీసులు రాధాకిషన్‌రావుపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఈనెల 10 తేదీ వరకు రాధాకిషన్‌రావును విచారించనున్నట్లు పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
Radhakishan Rao into custody :హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయడంలో ఆయన పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయని, ఆ దిశగా ప్రశ్నిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఎస్‌ఐబీలో చట్టవిరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్‌లను రూపొందించడం, ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా పక్షపాత ధోరణిలో వ్యవహరించడం వంటి విషయాలపై సమాచారం రాబడుతున్నామని డీసీపీ విజయ్‌కుమార్ వివరించారు. కస్టడీలో రాధాకిషన్‌రావు వెల్లడించే అంశాల ఆధారంగా మరి కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్డులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సర్వీస్ 2020 ఆగస్టులో ముగిసినా, మరో మూడేళ్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగానే కొనసాగినట్లు పేర్కొన్నారు. మరో వైపు ప్రభాకర్‌రావు ప్రోద్బలంతోనే ఎస్ఐబీలోకి వచ్చిన ప్రణీత్‌రావు(praneeth rao) అతని అడుగుజాడల్లోనే నడిచాడని, ఎస్‌ఐబీలో ప్రత్యేక ఎస్‌ఓటీ బృందాన్ని ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు.
వీరి ముఖ్య లక్ష్యం, ప్రతిపక్ష నాయకులతో పాటు బీఆర్‌ఎస్ రెబల్స్‌పై నిఘా పెట్టడమేనని తేల్చారు. జనంలో పేరున్న నాయకులు, క్యాడర్ ఉన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా పనిచేసినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌లోనూ పనిచేసేందుకు ప్రభాకర్‌రావు వారికి అనుకూలంగా పనిచేసే వారిని నియమించుకున్నట్లు వెల్లడించారు. మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాల్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు ఇతర అధికారులు ప్రభాకర్‌రావు బృందంలో ఉన్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ మూడో సారి గెలుపొందేందుకు ప్రతిపక్ష నేతలు, వారి మద్దతు దారులు, కుటుంబ సభ్యులు, వ్యాపారస్తులు, విమర్శకులతో పాటుగా బీఆర్‌ఎస్ పార్టీ నేతలు కూడా అధినేత నియంత్రణలోనే ఉండేలా, ఈ బృందం నిఘాపెట్టిట్లు రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న షాకింగ్ విషయాలు - టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపు - TS Phone Tapping Case
ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు : ఎర్రబెల్లి దయాకర్ - ERRABELLI ON PHONE TAPPING CASE