ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 1:18 PM IST

ETV Bharat / state

భీమిలిలో కత్తిపీటతో యువకుడు హల్​చల్ - సోషల్​ మీడియాలో వీడియో వైరల్​ - Person Halchal With Knife

Person Halchal With Knife in Bhimili : విశాఖ జిల్లా భీమిలి ప్రాంతంలో ఓ వ్యక్తి కత్తితో హల్​చల్​ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతుంది.

young_man_halchal
young_man_halchal (ETV Bharat)

భీమిలిలో కత్తిపీటతో యువకుడి హల్​చల్ - ఎందుకంటే?​ (ETV Bharat)

Person Halchal With Knife in Bhimili :ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న భీమిలి ప్రాంతంలో ఓ యువకుడు కత్తితో హల్ చల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా భీమిలి మండలం రాజుల తాళ్లవలసలో తాటిపూడి గిరీష్ అనే యువకుడు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డులో నాలుగు రోజుల క్రితం కత్తిపీటతో హల్​చల్​ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. రాజుల తాళ్లవలస వద్ద సర్వీస్ రోడ్డులో ఉన్న టీ డెస్టినీ వద్ద నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన తాటిపూడి గిరీష్ మద్యం మత్తులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.

ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం నిమిత్తం ఇంటర్వ్యూకు వచ్చిన మహిళ టీ డెస్టినీలో మంచినీటి బాటిల్ తీసుకునేందుకు వెళ్లి బస్సు కోసం నిరీక్షిస్తోంది. ఆ సమయంలో తాటిపూడి గిరీష్ అనే వ్యక్తి నా బండి ఎక్కు తీసుకెళ్తానని అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులు లేవంటూ ఆ మహిళను ఒత్తిడి చేశాడు. దీంతో ఆ మహిళ స్థానికులకు ఆయన ఎవరో తెలియదంటూ చెప్పడంతో ఆమెను బస్సు ఎక్కించి అక్కడి నుంచి సురక్షితంగా పంపించారు. ఇది మునసులో పెట్టుకున్న గిరీష్ టీ టైం దుకాణానికి వచ్చి నడి రోడ్డుపై కత్తిపీటతో నరుకుతానంటూ బెదిరింపులకు గురి చేశాడు.

అనంతలో పట్టపగలు రెచ్చిపోతున్న దొంగలు- గంటల వ్యవధిలో పార్కింగ్ చేసిన బైక్‌లు చోరీ - TWO WHEELER THIEVES

దీంతో చుట్టుప్రక్కల వారి సహాయంతో టీ డెస్టినీ యజమాని 100 కు ఫోన్ చేయగా భీమిలి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే గిరీష్ పరారయ్యాడు. మూడు రోజుల అనంతరం ఇవాళ గిరీష్​ను భీమిలి పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లారు. ఈ విషయమై సీఐ రమేష్ ను వివరణ కోరగా నిందితుడిపై బైండోవర్ కేసు నమోదు చేసి అతడిని విడిచి పెట్టేసారు. నడిరోడ్డుపై కత్తిపీటతో భయభ్రాంతులకు గురిచేసిన గిరీష్ గతంలో ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్వాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తిని ఎటువంటి చర్యలు చేపట్టకుండా వదిలేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు వాపోతున్నారు.

అర్ధరాత్రి వైఎస్సార్సీపీ సర్పంచ్‌ హల్​చల్ - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన - YSRCP Sarpanch Halchal

ఎమ్మిగనూరులో కత్తితో యువకుడి హల్​చల్ - సీసాలో పెట్రోలు పోయలేదని దాడికి యత్నం - One Person Halchal With Knife

ABOUT THE AUTHOR

...view details