People Questioned to CM Jagan: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌కు నిరసన సెగలు వెంటాడుతున్నాయి. కర్నూలు జిల్లాలో జరుగుతున్న బస్సుయాత్రను ప్రజలు అడ్డుకుంటున్నారు. శుక్రవారం గూడూరు మండలు పెంచికలపాడు నుంచి ఎమ్మిగనూరు సభకు వెళ్తుండగా ఖాళీ బిందెలతో మహిళలు అడ్డుకున్నారు. అదేవిధంగా ఈ రోజు అనంతపురం వెళ్తుండగా జొన్నగిరి దగ్గర మహిళలు సీఎం బస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జగన్ బస్సు యాత్రను అడ్డుకున్న గ్రామస్థులు - తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఆవేదన జొన్నగిరి చెరువును హంద్రీ జలాలతో నింపుతామని మాట ఇచ్చి నింపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు బిందెలు తీసుకొని రోడ్డుమీదకి వస్తుండగా ఇది గుర్తించిన పోలీసులు బిందెలు తీసుకురాకుండా అడ్డుకున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వారిస్తున్నా ప్రజలు వినకుండా సీఎం కాన్వాయ్‌ని అడ్డుకోవడం గమనార్హం. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ బస్సు దిగి వచ్చి మహిళలతో మాట్లాడి, సమస్య పరిశీలిస్తానని చెప్పి వెళ్లిపోయారు.
తాగునీటి సమస్యపై మహిళల నిరసన సెగ- ఎట్టకేలకు బస్సు దిగొచ్చిన సీఎం జగన్ - Women Protest CM Jagan
గత అయిదు సంవత్సరాలుగా ప్రజల ముందుకు రాని జగన్‌కు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో ఎక్కడికక్కడ నిరసన సెగ తగులుతోంది. కర్నూలు జిల్లాలో సాగిన జగన్ యాత్రను ప్రజలు ఇప్పటికే పలుమార్లు అడ్డుకున్నారు. శుక్రవారం సైతం కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర చేసిన జగన్‌కు నిరసన సెగ తగిలింది. గూడూరు మండలం పెంచికలపాడు నుంచి ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బస్సులో వెళ్తుండగా కొత్తూరులో ఖాళీ బిందెలతో మహిళలు జగన్‌ను అడ్డుకున్నారు. ఆయన బస్సును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత కలకలం రేగింది. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు.
మహిళలను ఆందోళన చూసి బస్సు ఆపి కిందకు దిగిన జగన్ వారి ఇబ్బంది అడిగి తెలుసుకున్నారు. 1200 మంది జనాభా ఉన్న తమ గ్రామానికి ఎల్ఎల్సీ నుంచి నీటికుంటకు నీటిని అందించి అక్కడి నుంచి గ్రామంలోని ట్యాంకు ద్వారా గతంలో తాగునీరు సరఫరా చేసేవారని గ్రామస్థులు వివరించారు. ఇప్పుడు పైపులైన్లు సరిగా లేకపోవడంతో తాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నేడు కూడా నేడు కూడా సీఎం జగన్‌కు కర్నూలు జిల్లాలో నిరసన సెగ తగిలింది.
వామపక్షాలు సైతం: మరోవైపు శుక్రవారం తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ వామపక్షాలు సైతం కోడుమూరులో నిరసన తెలిపాయి. సీపీఐ, సీపీఎం నాయకులు ప్లకార్డులు పట్టుకుని జగన్ బస్సు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దశాబ్దాలుగా తాగునీటి సమస్యను పరిష్కరించలేదంటూ వామపక్ష నాయకులు నినాదాలు చేశారు. కోడుమూరు గ్రామానికి నీరందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెళ్లిన తర్వాత వదిలిపెట్టారు.
నిరసనలు, ఆందోళనలతో జగన్ బస్సు యాత్ర! సభకు వచ్చిన వారికి డబ్బులు- వీడియోకు చిక్కిన వైసీపీ నేతలు - ys jagan memantha siddham bus yatra