People of Lanka Villages Facing Severe Problems During Rule of YSRCP : ఒకప్పుడు గోదారి గలగలా పారుతుంటే 'గోదారి గట్టుంది గట్టుమీద చెట్టుంది" అని పాట పాడుకునేవారు ! ఇప్పుడు గోదారి అక్కడే ఉన్నా గట్లు, గట్టు మీద చెట్లు మాయమయ్యాయి! ఏడికేడు వరదలు వందల ఎకరాల్ని నదిలో కలిపేస్తున్నాయి. లంక గ్రామాలకు రక్షణ కల్పిస్తామని ఒట్టేసిన వైఎస్సార్సీపీ నేతలు ఒట్టుతీసిన గట్టునపెట్టి అడ్డగోలు ఇసుక తవ్వకాలతో మరింత ముప్పు తెచ్చారు.! కొన్నాళ్లకు లంకలే కనుమరుగవుతాయేమోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
'ధవళేశ్వరంలోని సర్ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఎగువున దేవీపట్నం మండలం అంగుళూరు నుంచి సీతానగరం మండలం బొబ్బిల్లంక వరకు సుమారు 32 కిలోమీటర్ల పొడవున గోదావరి ఎడమ గట్టు ఉంది. ఈ ఎడమ గట్టు పలు చోట్ల బలహీనపడి జారిపోతోంది. సీతానగరం మండలం రామచంద్రాపురం, వంగలపూడి, రఘుదేవపురం, ముగ్గళ్ల, మునికూడలి, కాటవరం, బొబ్బిల్లంక, ములకల్లంక గ్రామాల్లో విలువైన పంట భూములు ఏటా కోతకు గురై నదిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే వందల ఎకరాల సారవంతమైన భూములు నదిలో కలిసి పోయాయి. ఏటా వరదల సీజన్‌లో ఎంతో కొంత మాయమైపోతోంది.'-సీతారామయ్య, సూరిబాబు, ములకల్లంక; పాల్, బొబ్బిల్లంక
Rudramkota Villagers in Godavari Flood Water గోదారికి వరదొస్తే.. ఆ గ్రామం కొండెక్కుతుంది! కన్నీటిపర్యంతం అవుతున్న బాధితులు!
'బొబ్బిల్లంక వైపు ఏటిగట్టు తీవ్ర కోతకు గురవుతోంది. వరదల సమయంలో ఆశల పంటలు కళ్ల ముందే నదిలో కొట్టుకుపోతుంటే అన్నదాతలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. బొబ్బిల్లంక, ములకల్లంక గ్రామాల ప్రజలు ఏడాదిలో ఆర్నెళ్లపాటు గోదావరిలోనే పడవ ప్రయాణం చేయాలి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన వంతెనను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పిల్లర్ల దశ దాటించలేకపోయింది.' -కోటేశ్వరరావు, ములకల్లంక
'సీతానగరం మండలంలో ఇష్టారీతిగా ఇసుక తవ్వకాలు చేయడంతో నదీ ప్రవాహం తీరు మారుతోంది. జాలిమూడి, కాటవరం, మునికూడలి పరిధిలో రాతి కట్ట కూడా వరదలకు కొట్టుకుపోయింది. తెలుగుదేశం హయాంలో రైతులకు కొంత డబ్బు చెల్లించి ఇసుక తవ్వుకునే వారు! వైఎస్సార్సీపీ ఏలుబడిలో రైతుల భూములకు చిల్లిగవ్వైనా ఇవ్వకుండా ఇసుక అమ్మేసుకున్నారు.'-వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, కృష్ణ, మునికూడలి
Godavari Floods in AP: ముంచెత్తిన గోదారి.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. ప్రభుత్వ సాయం కోసం నిర్వాసితుల నిరీక్షణ
గట్ల కోత నుంచి రక్షణ కల్పిస్తామని వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీలన్నీ గోదాట్లో కలిసిపోయాయి. 1986నాటి స్థాయి వరదలు వస్తే గట్టు ఆగే పరిస్థితి లేదని జలవనరుల శాఖ అధికారులు రెండేళ్ల క్రితమే నివేదికలు ఇచ్చినా, నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వరదను తట్టుకునేలా సుమారు ఐదున్నర కిలోమీటర్ల పొడవునా 23 కోట్ల రూపాయలతో గట్టు వెడల్పు పెంచాలని ప్రతిపాదించినా అమలు చేయలేదు.