ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీరు కారుని అద్దెకిస్తున్నారా? అయితే జాగ్రత్త - మీకు తెలియకుండానే! - Cars scam in Kadapa - CARS SCAM IN KADAPA

People Committing Frauds by Pawning Cars in Kadapa: కడపలో కొత్త తరహా మోసం కేసు వెలుగులోకి వచ్చింది. కార్లను అద్దెకు తీసుకుని కుదవ పెట్టి మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 కోట్ల విలువ చేసే 26 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్ల కుంభకోణం కడపలో చర్చనీయాంశంగా మారింది.

cars_scam_in_kadapa
cars_scam_in_kadapa (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2024, 2:02 PM IST

People Committing Frauds by Pawning Cars in Kadapa:సులువైన మార్గంలో డబ్బులు సంపాదించడంపై కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త రకాల చీటింగ్​లు చేస్తున్నారు. కాని చివరకు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా కడపలో కార్లను కుదవ పెట్టి చీటింగ్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కార్లను కుదవ పెట్టి మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు దాదాపు 2 కోట్ల రూపాయలు విలువచేసే 26 వాహనాలను పట్టుకున్నారు.

మీరు కారుని అద్దెకిస్తున్నారా? అయితే జాగ్రత్త - మీకు తెలియకుండానే! (ETV Bharat)

వివరాల్లోకి వెళ్తే కడప నబికోట చెందిన శశిధర్​రెడ్డి, జిలాని భాష అనే ఇద్దరు కార్ల యజమానుల వద్దకు వెళ్లి కార్లను నెలరోజుల పాటు అద్దెకి ఇవ్వాలని అడుగుతారు. నెలకు 30,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెబుతారు. యజమానులు నమ్మకంతో కార్లను అద్దెకిస్తారు. 2 లేదా 3 నెలల పాటు క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తారు. ఇక నాలుగో నెల వచ్చేసరికి అద్దె చెల్లించరు. దీంతో కార్ల యజమాని వచ్చి అద్దె ఇవ్వలేదు, కార్లు వెనక్కి ఇవ్వాలంటూ అడుగుతారు. కార్లు లేవు కుదవపెట్టామని చెప్పేస్తారు.

ఇలా దాదాపు 10 నుంచి 15 మంది వ్యక్తులకు సంబంధించిన 36 కార్లను అద్దెకు తీసుకొని వీరిద్దరూ కుదవ పెట్టారు. వాటిలో ఇప్పటివరకు పోలీసులు 26 కార్లను స్వాధీనపరుచుకున్నారు. మరికొన్ని కార్లను స్వాధీన పరుచుకోవాల్సి ఉంది. ఈ ఘటన ఇటీవల వెలుగులోకి రావడంతో బాధితులు ఒక్కోక్కరిగా వస్తున్నారు. ఇది వరకే జిలాని, శశిధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కార్లను కోర్టులో పెడతారా లేదా బాధితులకు న్యాయం చేస్తారా అనేది వేచి చూడాలి. ఈ కార్ల కుంభకోణం కడపలో చర్చనీయాంశంగా మారింది.

మిణుకు మిణుకు జీవితాలు - రెచ్చిపోతున్న ముఠాలు - మారని తీరు - Unlit Street Lights In Visakha

టికెట్లు లేకుండానే దూసుకెళ్లిన అభిమానులు - థియేటర్‌లో అర్ధరాత్రి గొడవ - Fight in movie theater

ABOUT THE AUTHOR

...view details