Pedda Hanuman Jayanti celebrations in Kondagattu 2024 : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉత్సవాలు ప్రారంభం కాగా, నేడు అంజన్న జయంతి కావటంతో అర్ధరాత్రి నుంచే స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు పోటెత్తారు. మాలధారులు దీక్షా విరమణ చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భారీగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
Hanuman Jayanti 2024 : సుమారు 2 లక్షల మంది దీక్ష విరమణ చేసినట్టు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉత్సవాలను పరిశీలించారు. అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉండి ఉత్సవాల నిర్వహణ చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వాహణపై దృష్టి పెడుతున్నామని అన్నారు. కోనేరులో నీళ్లను ఎప్పటికప్పుడూ మార్చుతున్నట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా వివరించారు.
"పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. దీక్ష విరమణ కోసం మాలధారులు భారీగా వచ్చారు. అలగే తాగునీరు, చలువ పందిళ్లు, ప్రసాదం విక్రయానికి 14 కౌంటర్లతో పాటు చలువ పందిళ్లను ఏర్పాటు చేశాం. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయి." - షేక్ యాస్మిన్ బాషా, జగిత్యాల జిల్లా కలెక్టర్