Judicial Inquiry On Kaleshwaram :కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌస్‌లకు చెందిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లను కూడా జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేయనున్నారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్‌ల ఇంజినీర్లను విచారణ చేయాలని కమిషన్ నిర్ణయించింది. సోమవారం నుంచి మూడు పంప్ హౌస్‌లకు చెందిన సీఈ నుంచి ఏఈఈ వరకు ఇంజినీర్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
కాళేశ్వరం విచారణపై పీసీ ఘోష్ కమిషన్ :ఇంజినీర్ల నుంచి కూడా అవసరమైన సమాచారం, వివరాలు సేకరించడంతో పాటు ఆ తర్వాత వారి నుంచి కూడా అఫిడవిట్లు తీసుకోనున్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది. రెండు వారాల్లోగా అన్ని దస్త్రాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖకు స్పష్టం చేసింది. తుది నివేదికలు ఇవ్వాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఎన్డీఎస్ఏ ఛైర్మన్‌తో ఆయన మాట్లాడినట్లు సమాచారం.
నిపుణుల కమిటీ సభ్యలతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశం :పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్కు కమిషన్ ఓ ప్రతినిధిని పంపి అధ్యయనం చేయించింది. కమిషన్‌కు సహాయకారిగా ఉండేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశమయ్యారు. కమిటీ ఇప్పటికే ఆనకట్టలను అధ్యయనం చేసినందున ఆ అంశాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.