తెలంగాణ

telangana

ETV Bharat / state

వైఎస్సార్సీపీ అవినీతి కోటలు బద్ధలు కొట్టి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేశాం : జనసేనాని - Pawan Press Meet After Success In AP - PAWAN PRESS MEET AFTER SUCCESS IN AP

Pawan Kalyan Press Meet In AP : వైఎస్సార్సీపీ అవినీతి కోటలు బద్ధలు కొట్టి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేశామని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించామని జనసేనాని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుని ప్రతీ రూపాయికి జవాబుతారీతనంగా వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం ప్రజలకుందన్నారు.

Pawan Kalyan Press Meet After Success In AP
Pawan Kalyan Press Meet In AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 7:06 PM IST

Updated : Jun 5, 2024, 7:54 PM IST

వైఎస్సార్సీపీ అవినీతి కోటలు బద్ధలు కొట్టి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేశాం : జనసేనాని (ETV Bharat)

Pawan Kalyan Press Meet After Success In AP :వైఎస్సార్సీపీ అవినీతి కోటలు బద్ధలు కొట్టి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేశామని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించామని జనసేనాని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుని ప్రతీ రూపాయికి జవాబుతారీ తనంగా వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం ప్రజలకుందన్నారు. జనసేన తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురంలో తన గెలుపునకు కృషి చేసిన వర్మకు కృతజ్ఞతలు తెలిపారు.

Nadendla Manohar On AP Result : ఏ నమ్మకంతో గెలిచామో వారి అంచనాలకు తగ్గట్లే పనిచేస్తామని తెనాలి నియోజవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాదెండ్ల మనోహర్ చెప్పారు. భవిష్యత్ లో ప్రజలకు ఏ విధింగా మంచి చేయాలనే అంశాలపై ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. పవన్ కల్యాణ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు.

ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పంతం నానాజీ చెప్పారు. వైకాపాలో జగన్ తప్ప ఎవరూ ఉండరని అందరూ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారన్నారు. ప్రధానంగా కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలు ఎగుమతి అవుతున్న బియ్యం రవాణపై దృష్టి సారిస్తున్నామన్నారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

దిల్లీకి చంద్రబాబు, పవన్- ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో పాల్గొన్న నేతలు - Chandrababu Delhi Tour

Nagababu Cangratulate Pawan Kalyan :ఈ విజయం అందరి సమష్టి కృషి అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఒక పార్టీ 100 శాతం విజయం దేశంలో ఎక్కడా వినలేదని అన్నారు. 21 మంది గెలుపు వెనుక 17 సంవత్సరాల అధ్యక్షుల శ్రమ దాగి ఉందని తెలిపారు. ఈ 17 ఏళ్లు ఆయన మానసికంగా, శారీరకంగా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి అందర్నీ విజయ పథంలోకి తీసుకువచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన వ్యక్తి అన్న నాగబాబు తమకు ఆయన నియోజకవర్గంలో పని చేసే అదృష్టం దక్కిందన్నారు.

పిఠాపురంలో పని చేసిన 45 రోజులు ఎంతో నేర్చుకున్నామని తెలిపారు. అక్కడ క్షేత్ర స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు, వీర మహిళలు చూపిన ప్రేమ అద్భుతమని కొనియాడారు. ఈ ఎన్నికలు ఇద్దరే నడిపారు. ఒకరు పవన్ కళ్యాణ్ అయితే, ఇంకొకరు సామాన్య ప్రజలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎర్ర కండువా మెడలో వేసుకుని పని చేశారన్నారు. ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, మనం బాధ్యతాయుతంగా పని చేస్తే 2029లో మరింత ప్రభావం చూపవచ్చని అన్నారు. హ్యాట్సాఫ్ టూ ప్రెసిడెంట్​ హ్యాట్సాఫ్ జన సైనికులు అని నాగబాబు కొనియాడారు.

"కూటమి ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చిందో అది నెరవేరుస్తాం. భారత దేశంలో 21 సీట్లకు 21 గెలుచామంటే అది జనసేన పార్టీనే. కక్షసాధింపు రాజకీయాలకు సమయం కాదు. రాష్ట్ర భవిష్యత్తుకి బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతుకు అండగా ఉంటాం. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం." -పవణ్ కళ్యాణ్, జనసేన అధినేత

'ప్రియమైన సీబీఎన్ మావయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు'- జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ - Junior NTR On AP Election Results

మేము ఎన్డీఏ కూటమితోనే ఉన్నాం - చంద్రబాబు క్లారిటీ - CHANDRABABU PRESS MEET TODAY

Last Updated : Jun 5, 2024, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details