తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో తవ్వేకొద్ది అప్పులు - అందుకే నేను జీతం తీసుకోను : పవన్‌ కల్యాణ్‌ - pawan kalyan Latest Comments - PAWAN KALYAN ON SALARY

Pawan Kalyan Speech in Gollaprolu : తన దేశం, నేల కోసం పని చేస్తానని, జీతాలు వద్దని చెప్పానని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదని, ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే తాను ఉన్నట్లు తెలిపారు. విజయయాత్రలు మాత్రం చేయడానికి సిద్ధంగా లేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

EAP Deputy CM Pawan Kalyan Interesting Comments in Gollaprolu
AP Deputy CM Pawan Kalyan Interesting Comments in Gollaprolu

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 3:00 PM IST

AP Deputy CM Pawan Kalyan Interesting Comments in Gollaprolu : తనను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

వ్యవస్థలను బలోపేతం చేస్తాం : అంతకుముందు పవన్ కల్యాణ్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ సోమవారం పూర్తవుతుందని, ఒకవేళ కాకపోతే మంగళవారం వరకు పూర్తి చేస్తామని పవన్ తెలిపారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. వ్యవస్థలను చంపి వ్యక్తులు పెరుగుతున్నారని అన్నారు. అందుకే ఇప్పుడు వ్యవస్థలను బలోపేతం చేస్తామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

''అధికారులు ఇంకా మారాల్సి ఉంది సార్‌' - 'లేదు మారారులే'' - చంద్రబాబు - లోకేశ్‌ మధ్య ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్ - cbn and lokesh Conversation

'కడప వంటి చోట్ల గనులు మొత్తం ఖాళీ చేశారు. గతంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. కనిపించిన ప్రతిచోటా డబ్బులు దండుకున్నారు.పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్‌ కట్టుకున్నారు. అవే నిధులు ఇక్కడ ఉపయోగిస్తే జిల్లా అభివృద్ధి అయ్యేది. తప్పులు ఎవరు చేసినా సరిదిద్దుతాం. ఒక తరం కోసం కాదు రెండు తరాల కోసం పనిచేస్తా. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని' పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

"నా దేశం, నేల కోసం పని చేస్తా, జీతాలు వద్దని చెప్పా. అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు, ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుంది. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభ వెలికితీయాలి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే నేను ఉన్నా. విజయయాత్రలు మాత్రమే చేయడానికి నేను సిద్ధంగా లేను. గెలిచినందుకు ఆనందం లేదు, పనిచేసి మన్ననలు పొందితేనే ఆనందం." - పవన్‌ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి

మోడల్‌గా పిఠాపురం :దేశంలో మోడల్‌ నియోజకవర్గంగా పిఠాపురాన్ని చేయాలనేది తన ఆకాంక్షని పవన్ కల్యాణ్ తెలిపారు. కాలుష్యం లేని పరిశ్రమలు ఇక్కడికి రావాలని చెప్పారు. విదేశాలకు వెళ్లేవారికి ఇక్కడ శిక్షణ ఇప్పించి పంపాలన్నారు. డబ్బులు వెనకేసుకోవాలనో? కొత్త పేరు రావాలనో? తనకు లేదని చెప్పారు. ప్రజల్లో సుస్థిర స్థానం కావాలని వివరించారు. అన్నీ పనులూ చిటికెలో కావని, కానీ అయ్యేలా పని చేస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

"మీ పార్టీ కాకపోతే పింఛన్లు తొలగిస్తారని ఆరోపించారు. పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే పింఛన్లు వస్తాయి. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఆగిపోతాయని ఆరోపించారు. పింఛన్లు ఆగకపోగా పెంచిన పింఛన్లు ఇంటికి చేరుతున్నాయి. మరోవైపు పర్యావరణశాఖను బలోపేతం చేస్తాం. పర్యావరణ కాలుష్యంపై జవాబుదారీతనం తీసుకువస్తాం. గోదావరి పారుతున్నా తాగేందుకు ఇబ్బందులున్నాయి. గతంలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులున్నా ఉపయోగించలేదు. గతంలో కనీసం మ్యాచింగ్‌ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు."- పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి

ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టేందుకు టాస్క్‌ ఫోర్స్‌ను బలోపేతం చేస్తాం : పవన్​ కల్యాణ్ - Pawan Kalyan on AP Red Sandalwood

ఏపీ అసెంబ్లీలో అసక్తిగా పవన్ కల్యాణ్ తొలి స్పీచ్ - ఏం మాట్లాడారో తెలుసా? - AP Deputy CM Pawan Kalyan

ABOUT THE AUTHOR

...view details