తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ అభ్యంతరకర పోస్టులను చూసి - నా కుమార్తెలు కన్నీరుపెట్టారు : పవన్​

సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెడుతున్న వైసీపీ మద్దతుదారులు - మంత్రివర్గ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం

Pawan Kalyan on Social Media Posts
AP Cabinet Meeting On Social Media Posts (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

AP Cabinet Meeting On Social Media Posts: ఏపీ ప్రభుత్వంలోని ముఖ్య నేతలను, వారి ఇంట్లో ఆడపిల్లలను, మహిళలను కించపరిచేలా వైఎస్సార్సీపీ నాయకులు, మద్దతుదారులు సోషల్​మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న తీరుపై ఆ రాష్ట్ర కేబినెట్ మండిపడింది. పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ సహా పలువురు మంత్రులు మాట్లాడారు. మంత్రుల మాటలను కొందరు ఎస్పీలు, డీఎస్పీలు పట్టించుకోవట్లేదని ఫిర్యాదు చేశారు.

దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నెలలో మొత్తం పోలీసు వ్యవస్థను గాడిలో పెడదామన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల అంశాన్ని మొదట సీఎం మొదలుపెట్టారు. ‘నాతో సహా, క్రియాశీల నేతలు, శ్రేణుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. నీచంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి అనిత కూడా బాధితురాలే. ఫేక్‌పోస్టుల వ్యవహారం న్యూసెన్స్‌గా మారింద'న్నారు. గతంలో లేని విష సంస్కృతి వ్యాపించిందని, దొంగ ఐపీలతో పోస్టులు పెట్టి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు.

Pawan Kalyan on Social Media Posts : కేబినెట్ మీటింగ్​లో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తన కుమార్తెలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని, వారు వీటిని చూసి కన్నీరు పెట్టడం తనను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోయానని ఆయన పేర్కొన్నారు. లోకేశ్‌ కుటుంబ సభ్యులపైనా అసభ్యంగా పోస్టులు పెట్టారని అన్నారు. ఇటీవల కొన్ని ఘటనల్లో మహిళలు, బాలికలపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారమైనా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై మంత్రిమండలి అసంతృప్తి వ్యక్తం చేసింది.

"పోలీసు వ్యవస్థ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత సర్కార్​లో ఒక దుర్మార్గుడు చెబితే చట్టాన్ని పక్కనబెట్టి మరీ పోలీసులు అరాచకాలన్నీ చేశారు. మనం ప్రజాస్వామ్యయుతంగా, చట్ట ప్రకారం పని చేయమన్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ’పోలీసు శాఖలో కొందరు అవినీతి అధికారులున్నారు. వారు అడ్డగోలుగా పని చేస్తున్నారు. కొన్ని కేసులపై ఎస్పీలు స్పందించడం లేదు. సరైన ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వడం లేదు." - పవన్ కల్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ పేరుపై చర్చ :పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్​లో ఆసక్తికర చర్చ జరిగింది. దాని సంక్షిప్తనామం పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ సంక్షిప్త నామం ‘పాడా’ అనే వస్తుందని, అది గందరగోళానికి దారి తీస్తుందని అభిప్రాయం వ్యక్తమైంది. అయితే పిఠాపురం స్పెల్లింగ్‌ ప్రకారం ‘పీడా’ అని పేరును ప్రతిపాదించడంతో ఆ పేరు బాలేదని పవన్‌ అభ్యంతరం తెలిపారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ పిఠాపురం అని పేరు పెడితే బాగుంటుందని అధికారులు సూచనలు చేశారు.

'ఆ పోస్టులకు తట్టుకోలేకే తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది'- పవన్ కల్యాణ్​ క్లారిటీ !

అవసరమైతే హోంమంత్రి పదవి కూడా తీసుకుంటా : పవన్‌కల్యాణ్‌

ABOUT THE AUTHOR

...view details