Panuganti Chaitanya Remand Extended:మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న పానుగంటి చైతన్యకు కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. 3 రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో అధికారులు ఈ రోజు గుంటూరులోని 6వ అదనపు న్యాయస్థానంలో హాజరుపరిచారు. మూడు రోజుల సీఐడీ కస్టడీలో అధికారుల ప్రశ్నలకు స్పందించని చైతన్య అన్నింటికీ తెలియదు, గుర్తులేదు, మరచిపోయాననే చెప్పి విచారణకు సహకరించకపోవడంతో ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం పానుగంటి చైతన్యకు మరో 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు పానుగంటి చైతన్యను తిరిగి కోర్టు నుంచి జిల్లా జైలుకు తరలించారు.
రెచ్చగొట్టి దాడికి పంపారు : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ముందు వైఎస్సార్సీపీ ఆఫీసులో ఆ పార్టీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారని పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో చెప్పినట్లు తెలిసింది. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు తన అనుచరులు తియ్యగూర గోపిరెడ్డి, పేరూరి అజయ్, రామిశెట్టి విశాల్ తదితరులతో గుంటూరు నాజ్ సెంటర్లో ఉన్నట్లు చైతన్య చెప్పినట్లు సమాచారం. అప్పుడు వైఎస్సార్సీపీ నేత నూనె ఉమామహేశ్వర్‌రెడ్డి ఫోన్ చేసి వెంటనే తనను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలని సూచించినట్లు అధికారుల ముందు చైతన్య ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
మీరు లెటర్లు రాసుకుంటే చంద్రబాబుకు ఏం సంబంధం? - ఆ విషయంలో జడ్జి విజయమ్మే : బాలినేని