Gas stove burners cleaning : వంటింట్లో పాలు పొంగిపోవడం సహజం. టీ అలా పెట్టి ఇలా వెళ్లొచ్చేసరికి పొంగిపోయి పొయ్యిని అప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గ్యాస్ స్టవ్ వాడుతున్నా కొద్దీ జిడ్డు మరకలు పేరుకుపోతుంటాయి. శుభ్రం చేయడం కాస్త ఆలస్యమైతే చాలు మొండి మరకలు పేరుకుపోతుంటాయి. గ్యాస్ స్టవ్‌తో పాటు దానిపై ఉన్న పాత్రలు, బర్నర్ మరకలను తొలగించడం కొంచెం కష్టమైన పనే. అందుకే ఈ మరకలను తొలగించడానికి గృహిణులు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, మరకలు తొలిగే పరిష్కారం వంటగదిలోనే ఉందని తెలుసా? కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి గ్యాస్ బర్నర్లు, స్టవ్‌పై మరకలను ఈజీగా తొలగించవచ్చు.
పక్కా కొలతలతో 'చికెన్ పచ్చడి' ఇలా పెట్టండి - 3 నెలలు నిల్వ పెట్టుకోవచ్చు!
ఆపిల్ సైడర్ వెనిగర్
వంట గ్యాస్ పొయ్యి అంచులపై జిడ్డు ఎక్కువగా పేరుకుపోతుంది. బర్నర్లు నల్లగా మారిపోతాయి. వీటిని తిరిగి మెరిపించాలంటే నల్లగా, జిడ్డు పట్టిన గ్యాస్ బర్నర్లను తెల్లగా మార్చడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ చక్కగా ఉపయోగపడుతుంది. దీని కోసం స్టవ్‌పై మరకలు ఉన్న చోట్ల కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి దానిని అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత స్క్రబర్ సాయంతో తుడిచి తర్వాత నీటితో శుభ్రం చేయడం వల్ల గ్యాస్ స్టవ్ మెరుస్తుంది. స్టవ్ బర్నర్ నల్లగా ఉంటే ఆపిల్ సైడర్ వెనిగర్‌కు కొంచెం బేకింగ్ సోడా కలుపుకొని అందులో గ్యాస్ బర్నర్‌లను వేసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది చల్లటి నీటిలో కడగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ బర్నర్లు పరిశుభ్రంగా కనిపిస్తాయి.
ఉల్లిపాయలు ఉడికించి
గ్యాస్ స్టవ్, బర్నర్లను శుభ్రం చేయడానికి ఉల్లిపాయలు చక్కగా పనికొస్తాయి. కొన్ని ఉల్లిపాయలను తీసుకొని 20 నిమిషాలు ఉడకబెట్టి పక్కనబెట్టాలి. నీరు చల్లారిన తర్వాత స్టవ్ మీద మరకలను శుభ్రం చేసుకోవాలి. ఉల్లిపాయలు ఉడికించిన నీటితో శుభ్రం చేసుకుంటే గ్యాస్ స్టవ్ కొన్ని నిమిషాల్లో శుభ్రం అవుతుంది. అంతే గాకుండా నీటిలో వేసి మరిగించినా గ్యాస్ బర్నర్ క్లీన అవుతుంది.
బేకింగ్ సోడా
గ్యాస్ స్టవ్ మాత్రమే కాదు వంటింట్లో ఇతర పాత్రలను పరిశుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. దీంతో పాటు నిమ్మరసం, ఆపిల్ వెనిగర్ బేకింగ్ సోడాతో కలిపి గ్యాస్ స్టవ్‌ను శుభ్రం చేసుకోవచ్చు. ముందుగా ఈ ద్రావణాన్ని సిద్ధం చేసుకుని వస్త్రం లేదా బ్రష్ అందులో ముంచి బర్నర్ శుభ్రం చేసుకుంటే క్లీన్ అవుతాయి.
నిమ్మకాయ
మొండి మరకలను తొలగించడంలో నిమ్మ రసం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకు నిమ్మరసం మాత్రమే కాదు నిమ్మ తొక్క కూడా ఉపయోగించవచ్చు. రసం నిల్వ చేసుకున్నాక నిమ్మ తొక్కలు తీసుకుని కొన్ని చుక్కల బేకింగ్ సోడా లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకోవాలి. అన్నింటితో కలిపి స్టవ్ బర్నర్ రుద్దుకుంటే సరి. జిడ్డుతో పాటు మరకలు కూడా మాయం.
డిష్ వాష్
నిమ్మకాయ, బేకింగ్ సోడా, ఉల్లిపాయలు మాత్రమే కాదు మీ వంటగదిలో ఉపయోగించే డిష్ వాష్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం స్క్రబ్బర్ పై కొన్ని చుక్కలు వేసుకుని గ్యాస్ స్టవ్‌పై పేరుకుపోయిన మరకలపై రుద్దితో సరిపోతుంది.
బాలీవుడ్ బ్యూటీ కొత్త రెసిపీ - నెట్టింట వైరల్‌గా మారిన 'కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ'
'ఉక్కులాంటి దేహానికి బలమైన ఆహారం ఇదే - మీ చిన్నారులకూ అలవాటే చేస్తే మేలు!'