తెలంగాణ

telangana

ETV Bharat / state

డిగ్రీ, బీటెక్‌ అర్హతతో ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు - చివరి తేదీ ఎప్పుడంటే? - ORDNANCE FACTORY JOBS 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌ - మెదక్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Ordnance factory jobs 2024
Ordnance factory jobs 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2024, 5:10 PM IST

Ordnance factory jobs 2024 : రక్షణశాఖ పరిధిలోని ఆర్మర్డ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఏవీఎన్‌ఎల్‌)కు చెందినటువంటి ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌ (ఓఎఫ్‌ఎంకే) 86 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులను ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌ విభాగానికి 57, ఈడబ్ల్యూఎస్‌కు(ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్స్‌) 3, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 17, ఎస్సీకి 7, ఎస్టీకి 2 పోస్టులను కేటాయించారు. పోస్టుల సంఖ్య, విద్యార్హతలు, తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. జూనియర్‌ మేనేజర్‌-50 పోస్టులు : మెకానికల్, ప్రొడక్షన్, క్వాలిటీ, ఎలక్ట్రికల్, బిజినెస్‌ అనలిటిక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

మెకానికల్‌ విభాగం : మెకానికల్‌/ మెకట్రానిక్స్‌తో బీటెక్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి.

ప్రొడక్షన్‌ విభాగం : ప్రొడక్షన్‌/ ఆటోమొబైల్‌/ మెకానికల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌/ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌/ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత. ఏడాదిపాటు అనుభవం ఉండాలి.

క్వాలిటీ విభాగం :మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ మెటలర్జీ ఇంజినీరింగ్‌ డిగ్రీ, క్వాలిటీ ఇంజినీరింగ్‌లో ఎంఈ/ఎంటెక్‌(మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ) ప్రథమ శ్రేణిలో పాసవ్వాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

ఇంటిగ్రేటెడ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ :ఇంజినీరింగ్‌ ఫస్ట్‌క్లాస్‌/ సప్లయ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ/ టెక్నాలజీ డిగ్రీతోపాటు మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ /పీజీ డిగ్రీ/ డిప్లొమా ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణులవ్వాలి. 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

ఎలక్ట్రికల్‌ విభాగం :ఎలక్ట్రికల్‌/ ఈఈఈ/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఫస్ట్‌ క్లాస్‌లో పూర్తిచేయాలి. 3 నుంచి నాలుగేళ్ల జాబ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉండాలి.

బిజినెస్‌ అనాలిసిస్‌ :బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ)/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిగ్రీ ప్రథమ శ్రేణిలో పాసవ్వాలి. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/ఎకనామిక్స్‌/ ఫారిన్‌ట్రేడ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి ఉండాలి. ఏడాది పాటు పని అనుభవం ఉండాలి.

2. డిప్లొమా టెక్నీషియన్‌-21: బీటెక్‌(మెకానికల్/ఆటోమొబైల్‌ లేదా మెకట్రానిక్స్/ మెటలర్జీ ఇంజినీరింగ్ డిప్లొమా / బీఎస్సీ(కెమిస్ట్ట్రీ)/ ఈఈఈ, ఎలక్ట్రికల్‌, ప్లాంట్ మెయింటెనెన్స్, డిప్లొమా. 1-2 పని అనుభవం ఉండాలి.

3. అసిస్టెంట్‌-11 : ఏదైనా డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ హెచ్‌ఆర్‌(హ్యూమన్‌ రిసోర్స్‌)/ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/ పీఎం అండ్‌ ఐఆర్‌లో ఏడాది డిప్లొమా చేసి ఉండాలి.

స్టోర్స్‌లో : ప్రథమ శ్రేణిలో డిగ్రీ పాసై మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌/ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో ఏడాదిపాటు డిప్లొమా, ఎంఎస్‌ ఆఫీస్‌(మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌) పరిజ్ఞానం ఉండాలి.

జేఏ (జూనియర్‌ అసిస్టెంట్‌-4) : కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టిసెస్‌లో 3 ఏళ్ల డిప్లొమా చేసి ఉండాలి/ టైపింగ్‌ సర్టిఫికెట్‌తో హెచ్‌ఎస్‌సీ చేసి ఉండాలి. ఏడాది పాటు వర్క్‌ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

వయసు :ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు 30 ఏళ్ల వయసు మించకూడదు. ఓబీసీ(ఎన్‌సీఎల్‌)లకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, , దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

ఎంపిక విధానం : విద్యార్హతలకు సంబంధించిన డిగ్రీలో సాధించిన అకాడమిక్ మార్కులకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇస్తారు. అన్ని పోస్టులకూ వెయిటేజీ ఇదే మాదిరిగా ఉంటుంది.

డిగ్రీలో జనరల్‌ అభ్యర్థులకు 65 శాతం, ప్రత్యేక వర్గాలవారు 55 శాతం కనీస అర్హత మార్కులను సాధించాలి.

అభ్యర్థులు డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేస్తారు. దీంట్లో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

అభ్యర్థులకు కాల్‌ లెటర్లను పోస్టులో పంపరు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌/ ఇంటర్వ్యూ/ ట్రేడ్‌టెస్ట్‌/ తుది ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంచుతారు.

జీతభత్యాలు : జూనియర్‌ మేనేజర్‌కు నెలకు రూ.30వేలు, డిప్లొమా టెక్నీషియన్‌కు రూ.23వేలు, అసిస్టెంట్‌కు రూ.23,000, జూనియర్‌ అసిస్టెంట్‌కు రూ.21,000. మూలవేతనంతోపాటు డీఏ(డియర్‌నెస్‌ అలవెన్స్), స్పెషల్‌ అలవెన్స్, యాన్యువల్‌ ఇంక్రిమెంట్‌ ఉంటాయి. మెడికల్, ఇన్సూరెన్స్‌ ప్రీమియంల కోసం నెలకు రూ.3వేలను చెల్లించనున్నారు. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఎక్స్‌గ్రేషియా, లభ్యతను బట్టి యూనిట్లలో వసతి సదుపాయం ఉంటాయి.

అప్లై చేసేందుకు చివరి తేదీ :ప్రకటన వెలువడిన తేదీ (11.11.2024) నుంచి 21 రోజుల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్ : https://avnl.co.in/

హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​లో ఉద్యోగాలు - ఎవరెవరు అర్హులంటే

కోల్​ ఇండియాలో ఉద్యోగాలు - మొదటి నెల నుంచే రూ.50వేల వేతనం

ABOUT THE AUTHOR

...view details