Online Trading Fraud in Hyderabad :సైబర్ క్రైమ్స్‌పై ఎంత అవగాహన కల్పించినా నిత్యం ఎవరోఒకరు మోసపోతూనే ఉన్నారు. పెట్టుబడులు-అధిక లాభాల పేరుతో సైబర్ కేటుగాళ్లు(Cyber Threats) వేసిన వలకు ఎంతోమంది అమాయకులు చిక్కి బలవుతున్నారు. తాజాగా ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట పదిలక్షల రూపాయలు పైగా మోసపోయానని, హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంజినీర్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సైబర్ నేరాల కట్టిడికి కొత్త వ్యూహాలతో సమాయత్తమవుతున్న పోలీసులు
ట్రేడింగ్‌లో లాభాలు పొందవచ్చని సైబర్ నేరగాళ్లు, టెలిగ్రామ్‌లో బాధితుడుకి మెసేజ్ చేశారు. ముందు నిందితులు బాధితుడి ఖాతాలో రూ. 10 వేలు జమచేసి పెట్టుబడి పెట్టాలని సూచించారు. తద్వారా లాభాలు వచ్చేలా చేశారు. ఇది నమ్మిన బాధితుడు సొంత డబ్బులను భారీగా పెట్టుబడి పెట్టాడు. వాటి లాభాలు విత్‌డ్రా చేసుకునేందుకు లాభం ఎంత వచ్చిందో అంత మొత్తం ఇన్వెస్ట్(Investment) చేయాలని నేరగాళ్లు సూచించారు. దాంతో వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు రూ. 10,59,540 చెల్లించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Cyber Crime in Hyderabad :అన్ని డబ్బులు చెల్లించిన తర్వాత మరిన్ని చెల్లించాలని కేటుగాళ్లు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కాగా, ధ్రువీకృత వెబ్‌సైట్లలో(Verified Websites) మాత్రమే లాభాల కోసం పెట్టుబడులు పెట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత లింక్‌లు, వెబ్‌సైట్లు, వ్యక్తులను నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ తరహా మోసాలకు గురైతే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.