సైబర్ నేరగాళ్ల నయామోసం - లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలు Online Investment Frauds In Hyderabad: మనిషి అత్యాశను క్యాష్ చేసుకొనే సైబర్ ముఠాలు మన చుట్టూ ఉన్నారని తెలిసినా మనలో ఆశ చావదు. మన అవివేకమే సైబర్ నేరస్థులకు వరంగా మారుతోంది. ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే రోజువారీగా లాభాలు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటన చూసి హైదరాబాద్‌లో చాలామంది కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఇలాంటి స్కాములతో ఇప్పటికే చాలామంది మోసపోయారు - ఇలాంటి వాటిని నమ్మొద్దు అని పోలీసులు చెబుతున్నా ఈ ఆశాజీవుల చెవికెక్కలేదు. ఫలితంగా సైబర్ నేరగాళ్లు సుమారు వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.
ఫ్యానిక్ కంపెనీ పేరిట నకిలీ వెబ్సైట్ ఖాతా తెరిచిన సైబర్ నేరగాళ్లు లక్ష పెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10వేల చొప్పున లాభాలిస్తామని నమ్మబలికారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని నమ్మి హైదరాబాద్‌కి చెందిన కొంత మంది లక్షల్లో పెట్టుబడి పెట్టారు. ఈ నెల 26 నుంచి వెబ్సైట్ పనిచేయకపోవడంతో మోసపోయామని గమనించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Hyderabad Online Investment Frauds :అధిక లాభాలు వస్తాయని ఆన్‌లైన్‌లో పెట్టుబడిపెట్టి చేసి మోసపోయిన పలువురు బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఫ్యానిక్ కంపెనీ పేరిట వెబ్సైట్ నుంచి తమను ఆశ్రయించారని బాధితులు వివరించారు. వారు చూపించే ప్రొడక్ట్స్‌పై పెట్టుబడి పెడితే నాలుగు రెట్లు అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారని తెలిపారు.
సైబర్ నేరాల కట్టిడికి కొత్త వ్యూహాలతో సమాయత్తమవుతున్న పోలీసులు
"ఫ్యానిక్ కంపెనీ వెబ్సైట్ నుంచి లక్ష పెట్టుబడి పెడితే రోజుకు పదివేలు చొప్పున 40 రోజుల్లో 4లక్షల వస్తాయని మోసం చేశారు. కొత్తవారిని ఈ స్కీమ్‌లో చేర్చితే కమీషన్లు కూడా ఇచ్చారు. దీనితో చాలా మందితో ఈ వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టించాము. కాని గత కొన్ని రోజులుగా వెబ్సైట్ పనిచేయడం లేదు. తమను మోసం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలి." -బాధితులు
Victims Complaint to Hyderabad Police : కొత్త వారిని ఈ స్కీమ్‌లో చేర్చితే మొదట రూ.500 నుంచి రూ.1000 రూపాయల వరకు కమీషన్ కూడా ఇచ్చారని తెలిపారు. ఇలా చైన్ సిస్టం ద్వారా సుమారు సుమారు 500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టామని బాధితులు తెలిపారు. మొదట కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశామని దానికి లాభాలు ఇచ్చి నమ్మకం కలిగించారని పేర్కొన్నారు. దీనితో చాలా మంది లక్షకు పైగా ఇన్వెస్ట్ చేశామని అన్నారు. ఈ నెల 26 నుంచి కంపెనీ వెబ్సైట్ పనిచేయడం లేదని వాపోయారు. చాలా మంది అప్పులు చేసి ఈ వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టారని తమను మోసం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Cyber Security Bureau shikha Goel On Cyber Crimes : ఉన్నత విద్యావంతులు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడటానికి అత్యాశ, అవగాహన లేకపోవడమే కారణమని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. నానాటికీ పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిని అప్రమత్తం చేసి, నష్టపోకుండా చూసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు - సీవీ ఆనంద్ పేరుతో ఫేక్ అకౌంట్
రూ.1500 పెట్టుబడి పెడితే వంద రోజులపాటు రోజుకు రూ.50 - సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పోలీసులు