Online Gaming Frauds Hyderabad :నేడు సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాలను అన్వేషిస్తూ మోసం చేయడానికి వెనకాడడంలేదు. అందులోను సులభంగా డబ్బును సంపాదించవచ్చని ఆశ చూపుతున్నారు. ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వల విసిరి పలువురి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును దోచేస్తున్నారు. ఈ నేరాల్లో మహిళలు, విద్యార్ధులు బాధితులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 20 రోజుల్లో సైబర్ నేరగాళ్ల చేతిలో సుమారు 10 కోట్ల మంది బాధితులు మోసపోయారంటే పరిస్థితి ఊహించవచ్చు. వీటి కారణంగా బాధితులైన అమాయకలు నేరస్థులుగా మారుతున్నారు.
ఓ గేమింగ్ వైబ్‌సైట్ ద్వారా దేశంలో 2 వందల మంది వంద కోట్ల రూపాయలు పోగొట్టకున్నట్టు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఇటీవల గేమింగ్ వెబ్‌పోర్టల్ ద్వారా 70 లక్షలు కోల్పోయినట్టు బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విచారణ అనంతరం సైబర్ నేరస్థులకు బ్యాంకు ఖాతాలు అందజేస్తున్న నిందితుడు హితేష్‌గోయల్‌ను అరెస్టు చేశారు. ఇటీవల 4 వందలకు పైగా ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లు, వివిధ వెబ్‌సైట్ల ద్వారా భారీ మోసాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
Tips to Quit Online gaming : ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం నుంచి బయపడాలా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే
Online Apps Frauds Hyderabad : నగరానికి చెందిన ఓ గృహిణి ఇళ్లు కొనుగోలు చేసేందుకు బ్యాంకు నుంచి 21 లక్షల రూపాయల రుణం తీసుకుంది. అధిక సొమ్ములు వస్తాయని ఆన్‌లైన్ గేమింగ్‌లో సర్వం కోల్పోయింది. మరో మహిళ ఈ గేమింగ్‌కు బానిసగా మారి ఆడేందుకు డబ్బులు లేక నేరస్తురాలిగా మారింది. ఇవేకాక అగంతకులు అనేక మార్గాలను ఎంచుకొని నేరాలు చేస్తున్నారు. నేరస్థుల్లో మహిళలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.