ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరెంట్​ కష్టాల నుంచి రైతులకు విముక్తి దిశగా APSPDCL అడుగులు - Apspdcl Help line number

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 6:16 PM IST

Officials Respond to Incident of Downed Electrical Wires in Farm : సమస్యలకు స్పందించే ప్రభుత్వ ముంటే సత్వరం పరిష్కారం దొరుకుతుందనడానికి ఇదో ఉదాహరణ. వైఎస్సార్ జిల్లాలో విద్యుత్తు తీగలు వాలిన ఘటనపై 'ఈటీవీ- ఈటీవీ భారత్' కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే సమస్యను పరిష్కరించడంతో పాటు, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుడదని నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హెల్పలైన్ నంబరును ఏర్పాటు చేశారు.

Officials Respond to Incident of Downed Electrical Wires in Farm
Officials Respond to Incident of Downed Electrical Wires in Farm (ETV Bharat)

Officials Respond to Incident of Downed Electrical Wires in Farm : సమస్యలకు స్పందించే ప్రభుత్వ ముంటే సత్వరం పరిష్కారం దొరుకుతుందనడానికి ఇదో ఉదాహరణ. వైఎస్సార్ జిల్లాలో విద్యుత్తు తీగలు వాలిన ఘటనపై 'ఈటీవీ - ఈటీవీ భారత్' కథనానికి అధికారులు స్పందించారు. సమస్యను పరిష్కరించడంతో పాటు హెల్ప్ డెస్క్ నూ ఏర్పాటు చేశారు. నాగసానిపల్లెలో వాలిన విద్యుత్తు తీగలను ప్లాస్టిక్ పైపుల సహాయంతో రైతు పొలం పనులు చేసుకోవడంపై కథనం ప్రసారమైంది. దీంతో ఏపీఎస్పీడీసీఎల్‌(APSPDCL)అధికారులు వెంటనే సమస్య పరిష్కరించడంతో పాటు మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుడదని నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా 9440814264 వాట్సాప్ హెల్పలైన్ నంబరును ఏర్పాటు చేశారు. విద్యుత్తు తీగలు వేలాడుతున్నా స్తంభాలు వాలి ఉన్నా, తీగలు తెగే అవకాశం ఉన్నా జంపర్లు వదులుగా ఉన్నా, మంటలు చెలరేగుతున్నా వినియోగదారులు చిత్రాలు తీసి హెల్ప్ డెస్క్ వాట్సాప్ నంబరుకు పంపితే సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్తు అధికారులు తెలిపారు.

నివాస భవనాలను తాకుతున్న విద్యుత్ తీగలు.. ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

వైఎస్సార్సీపీ అధినేత జగన్ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసినా ఆయన సొంత జిల్లాలో మూడేళ్లుగా ముప్పుతిప్పలు పడుతున్న రైతు గంగయ్య సమస్యకు పరిష్కారం చూపలేదు. కూటమి ప్రభుత్వం స్పందించడంతో మూడు గంటల వ్యవధిలోనే ఆ అన్నదాత సమస్య తీరింది. వైఎస్సార్ జిల్లా ఖాజీ పేట మండలం నాగసానిపల్లెకు చెందిన గంగయ్య పొలంలో విద్యుత్తు తీగలు నేలను తాకుతుండేవి. దాంతో పొలం పనులు చేసేటప్పుడు ప్రమాదకరమని తెలిసినా తప్పక కుటుంబ సభ్యుల ద్వారా తీగలను కర్రలతో పైకెత్తి తర్వాత వదిలేవారు.

ఇళ్ల మధ్య వేలాడుతున్న 11కేవీ విద్యుత్​ వైర్లు... పట్టించుకోని అధికారులు

ఈ సమస్యను మూడేళ్లుగా ప్రజాప్రతినిదులు, ఎస్పీడీసీఎల్ అధికారుల దృష్టికి రైతు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. ఇటీవల వర్షాలు పడడంతో దుక్కి చేయడానికి మంగళవారం ఉదయం రైతు పొలానికి వెళ్లారు. ఎప్పటిలాగానే తీగలను పైకెత్తి దుక్కి చేస్తున్నారు. దీనిపై 'ఈటీవీ- ఈటీవీ భారత్' లో కథనం ప్రసారమైంది. ఇది విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి వెళ్లింది. స్పందించిన ఆయన ఆ జిల్లా ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణతో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దాంతో ఆయన తమ సిబ్బంది ద్వారా విద్యుత్తు స్తంభాన్ని పొలానికి పంపించి మూడు గంటల వ్యవధిలోనే తీగలను సరిచేయించారు. వెంటనే సమస్యను పరిష్కరించడంతో పాటు మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుడదని నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా ఈరోజు హెల్పలైన్ నంబరును సైతం ఏర్పాటు చేశారు.

కరెంట్ షాక్​తో సచివాలయ ఉద్యోగి మృతి- ఫ్లెక్సీలను తొలగిస్తుండగా ఘటన

ABOUT THE AUTHOR

...view details