Mock Polling for Ongole Assembly Constituency :ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంల్లో మాక్ పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయ ఢంకా మోగించారు. నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 34,060 ఓట్లతో ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు.
Officers Preparations Mock Polling in Ongole Seat : వైఎస్సార్సీపీ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూటమిపై ఉన్న నమ్మకంతో దామచర్ల జనార్దన్‌కు ప్రజలు పట్టం కట్టారు. దీనికితోడూ నగరంలో ఆయన అంతకుముందు చేపట్టిన అభివృద్ధి పనులు వెరసి ఈ ఆదరణ లభించినట్లైంది. అయితే ఓటింగ్ సరళి, ఈవీఎంలపై తనకు అనుమానాలున్నట్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు.
మొత్తం 12 కేంద్రాల్లో : పన్నెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహణ చేపట్టాలని బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆయన రూ.5.44 లక్షల నగదును ఎన్నికల సంఘానికి చెల్లించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్ తమీమ్ అన్సారియా హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మే 13 నాటి ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు.